Share News

సీఈవో సీఎంగా కంటే నీటిని అందించిన నాయకుడిగా గుర్తుండాలనుకుంటున్నా: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 05 , 2026 | 08:40 AM

తాను ‘సీఈవో సీఎం’గా కంటే నీటిని అందించిన నాయకుడిగా గుర్తుండాలనుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తన వారసత్వం నీటి ప్రవాహంలో కనిపించాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

సీఈవో సీఎంగా కంటే నీటిని అందించిన నాయకుడిగా గుర్తుండాలనుకుంటున్నా: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu

అమరావతి, సెప్టెంబర్ 05: తాను ‘సీఈవో సీఎం’గా కంటే నీటిని అందించిన నాయకుడిగా గుర్తుండాలనుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తన వారసత్వం నీటి ప్రవాహంలో కనిపించాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. శనివారం సీఈఓ సీఎం టు వాటర్ మాన్: నాయుడుస్ లాంగ్ జర్నీ ఎంటర్స్ టూ ఏ న్యూ ఫేజ్ పేరిట ఎకనామిక్ టైమ్స్‌లో సీఎం చంద్రబాబు మీద వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.


పోలవరం ఎడమ ప్రధాన కాలువ, వెలిగొండ ప్రాజెక్టులు మైలురాళ్లని ఆయన అభివర్ణించారు. దశాబ్దాల కలగా ఉన్న ఈ రెండు కీలక సాగునీటి ప్రాజెక్టులు వాస్తవ రూపం దాల్చాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల జీవితాల్లో సరికొత్త మార్పు చూస్తారని అన్నారు. ఈ ప్రాజెక్టులు.. రైతులకు ఆశ, వ్యవసాయానికి కొత్త ఊపును ఇస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాగు నీటి భద్రతకు ఇవి చిరస్థాయిలో నిలిచిపోయే ఆస్తులుగా మిగులుతాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం గాలింపు ముమ్మరం

మద్యం మత్తులో దాడి.. యువకుడికి తీవ్ర గాయాలు

For More AP News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 08:51 AM