జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ కేసు.. రెండో రోజు నిందితులను ప్రశ్నిస్తున్న పోలీసులు
ABN , Publish Date - Sep 05 , 2026 | 09:38 AM
జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో నిందితుల రెండో రోజు కస్టడీ విచారణ ప్రారంభమైంది. ఇద్దరినీ రెండు రోజుల పాటు విచారణకు నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వడంతో... కోడూరి మీనా కుమారి, వినీల్ చౌదరిలను జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 5: జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో నిందితుల రెండో రోజు కస్టడీ విచారణ ప్రారంభమైంది. ఇద్దరినీ రెండు రోజుల పాటు విచారణకు నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వడంతో... కోడూరి మీనా కుమారి, వినీల్ చౌదరిలను జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ తల్లి మీనా కుమారి నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల కుటుంబాలను డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆగస్టు 11 రాజస్థాన్‌లో మీనా కుమారి, వినీల్ చౌదరిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కస్టడీలో కీలకమైన విషయాలు రాబట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు నేటితో నిందితుల కస్టడీ విచారణ ముగియనుంది.
కాగా.. ధనవంతుల పిల్లలే టార్గెట్‌గా ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా మైనర్లను ట్రాప్ చేస్తున్న ఇద్దరిని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అర్జున్ ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా సంపన్న వర్గాల పిల్లలతో ముందుగా పరిచయం ఏర్పరుచుకుని ఆపై వారికి మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపేవాడు. అనంతరం వారిని బలవంతం చేయడంతో పాటు ప్రైవేటు వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. మైనర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నిందితుడికి తల్లి కూడా సహకరించిందని.. ఆమె అకౌంట్ ద్వారానే లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు విషయం బయటకు రావడంతో ప్రధాన నిందితుడి తల్లితో పాటు వినీల్ చౌదరి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతివ్వడంతో.. ఇద్దరినీ జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
‘ఇంటింటికీ’ @ కోటి.. కోటి ఇళ్ల మైలురాయిని దాటిన కార్యక్రమం
ఇలాగైతే పనులు ఎలా పూర్తవుతాయి?
Read Latest AP News And Telugu News