Share News

మార్కాపురం: అర్ధవీడు మండలంలో పెద్దపులి సంచారం

ABN , Publish Date - Sep 05 , 2026 | 07:53 AM

మార్కాపురం జిల్లా పరిధిలోని అర్ధవీడు మండలం బొల్లుపల్లి సమీపంలోని అల్లూరేణికుంట వద్ద పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మార్కాపురం: అర్ధవీడు మండలంలో పెద్దపులి సంచారం
Markapuram Tiger News

మార్కాపురం, సెప్టెంబర్ 5: జిల్లా పరిధిలోని అర్ధవీడు మండలం బొల్లుపల్లి సమీపంలోని అల్లూరేణికుంట వద్ద పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గత నెల 28న మేతకు వెళ్లిన ఓ గేదెను పెద్దపులి చంపి తినడంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గేదె కనిపించకపోవడంతో వెతికిన యజమానికి.. దాని కళేబరం కనిపించడంతో అనుమానం వ్యక్తమైంది. పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో గ్రామస్థులు.. పశువుల కాపరులు అప్రమత్తమయ్యారు.


అటవీ ప్రాంతానికి సమీపంలో పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఒంటరిగా అడవివైపు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. పెద్దపులి సంచారం విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామాల ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. అల్లూరేణికుంట పరిసర ప్రాంతాల్లో పులి సంచరించే అవకాశం ఉన్న మార్గాలను గుర్తించి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి కదలికలపై స్పష్టత వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టేందుకు అటవీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజధానికి రక్షణ కవచం!

ఆటో మీటర్‌.. తొలి 1.6 కి.మీ.కు రూ.30

For More TG News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 08:43 AM