సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగుస్తాయని ఆశిస్తున్నాం: ఏపీ ఎన్జీవో చీఫ్ విద్యాసాగర్
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:29 AM
సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవడాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు. సీఎం వద్ద తమ సమస్యలు అన్నింటినీ ప్రస్తావిస్తామని చెప్పారు. సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 5: ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉద్యోగ సంఘాల ప్రతినిధిలు భేటీకానున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు(శనివారం) ఉదయం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సీఎం వద్ద తమ సమస్యలు అన్నింటినీ ప్రస్తావిస్తామని చెప్పారు. సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగుస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
సీఎంతో సానుకూలమైన ఫలితాలు వస్తాయని అనుకుంటున్నామని విద్యాసాగర్ తెలిపారు. ప్రభుత్వంతో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి తప్ప ఆందోళన వల్ల ఏం సాధించలేమని చెప్పారు. గతంలో జీవోఎంతో ఆరు గంటల పాటు చర్చలు జరిపామని.. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం చేయాలని కోరుతున్నామని అన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినందున రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని వాయిదా వేసుకుని మరీ వచ్చినట్లు వెల్లడించారు. చర్చల్లో సానుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నామని విద్యాసాగర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ కేసు.. రెండో రోజు నిందితులను ప్రశ్నిస్తున్న పోలీసులు
ఉపాధ్యాయులందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు: చంద్రబాబు, పవన్, లోకేశ్
Read Latest AP News And Telugu News