Share News

ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తీసేయాల్సిందే: ఎంపీ రఘునందన్

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:22 PM

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని సింఫనీ పార్క్ హోమ్స్ కాలనీలో 22ఏ పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు.

ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తీసేయాల్సిందే: ఎంపీ రఘునందన్
MP Raghunandan Rao

సంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 5: పటాన్‌చెరు నియోజకవర్గంలోని సింఫనీ పార్క్ హోమ్స్ కాలనీలో 22ఏ పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. సింఫనీ పార్క్ హోమ్స్‌కు సంబంధించిన 15వందల ఇళ్లను నిషేధిత జాబితాలో పెట్టడంపై కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. పఠాన్‌చెరులో 55 ఎకరాల్లో ప్రభుత్వ శాఖల అనుమతులతో సింఫనీ హోమ్స్ నిర్మాణం జరిగిందని ఎంపీ తెలిపారు.


రూపాయి రూపాయి కూడబెట్టి, లోన్లు తీసుకుని నిర్మించుకున్న ఇళ్లను రాత్రికి రాత్రి 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చడం బాధాకరమని ఎంపీ అన్నారు. 12 ఏళ్ల క్రితం నిర్మాణం జరిగిన కాలనీని ఎలా నిషేధిత జాబితాలో చేరుస్తారని ప్రశ్నించారు. ఎవరు దరఖాస్తు చేశారని 22 ఏ జాబితా నుంచి రేవంత్ రెడ్డి ఇల్లు తొలగించారని నిలదీశారు. అదే తరహాలో ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తీసివేయాలని డిమాండ్ చేశారు. తప్పు జరిగిందని రెవెన్యూ మంత్రి క్షమాపణ చెబితే సరిపోదని... జరిగిన తప్పును సరిదిద్దాలని సూచించారు. 22 ఏ జాబితాలో తప్పులకు బాధ్యులైన అధికారులను ప్రభుత్వం శిక్షించాలని ఎంపీ రఘునందన్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

ఇలాగైతే పనులు ఎలా పూర్తవుతాయి?

రాధాకృష్ణన్‌ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 12:31 PM