విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే టీచర్లకు గొప్ప గుర్తింపు: ఎంపీ శ్రీభరత్
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:46 PM
విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయులకు లభించే గొప్ప గుర్తింపు అని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 5: విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయులకు లభించే గొప్ప గుర్తింపు అని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు తెలియజేశారు. 69,947 మంది ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో 1500 మంది విద్యార్థులు పెరిగారన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఇది నిదర్శనమని చెప్పుకొచ్చారు. ‘ఆరోగ్యం, విద్యకు నా ఎంపీ లాడ్స్ నిధులు ఖర్చు చేయాలని నిర్చయించుకున్నా. పాఠశాలలో మౌలిక వసతులు కావాలంటే మా దృష్టికి తీసుకురావాలి’ అని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.
ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి: కలెక్టర్
ఉపాధ్యాయులకు ఎన్ని అవార్డులు ఇచ్చినా వారు చేసే సేవ ముందు తక్కువే అని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ అన్నారు. ఉపాధ్యాయులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఉపాధ్యాయ వ్యవస్థకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు. ‘ప్రతి ఒక్కరి విజయం వెనుక ఒక టీచర్ ఉంటారు... నా మొదటి గురువు నా తల్లి. నేను ఐఏఎస్ కాకపోతే ఉపాధ్యాయ వృత్తి వైపు వెళ్లేవాడిని’ అని చెప్పుకొచ్చారు. వైజాగ్‌లో ఉన్న ఉపాధ్యాయులు దేశంలోనే ఒక బ్రాండ్‌గా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విశాఖ జిల్లాలో విద్యార్థులను ఉపాధ్యాయులు మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగుస్తాయని ఆశిస్తున్నాం: ఏపీ ఎన్జీవో చీఫ్ విద్యాసాగర్
ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. హైపవర్ కమిటీ సమావేశంలో నిర్ణయం
Read Latest AP News And Telugu News