Share News

రేపటి నుంచి ‘వాక్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరుతో కిషన్ రెడ్డి పాదయాత్ర

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:55 AM

‘వాక్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరుతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేపటినుంచి (మంగళవారం) మూడు రోజులపాటు హైదరాబాద్‌లో పాదయాత్ర చేయనున్నారు. యాత్ర ముగింపుగా ఈ నెల 27వ తేదీన సంకల్పసభను నిర్వహించనున్నారు.

రేపటి నుంచి ‘వాక్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరుతో కిషన్ రెడ్డి పాదయాత్ర
nasha mukt bharat walk hyderabad

హైదరాబాద్, నవంబరు 24: ‘వాక్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరుతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేపటినుంచి (మంగళవారం) హైదరాబాద్‌లో పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్ర అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు 30 కి.మీ. కొనసాగనుంది. ఈ యాత్ర ముగింపుగా ఈ నెల 27వ తేదీన సంకల్పసభను నిర్వహించనున్నారు.


ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్‌ డ్రగ్స్‌. డ్రగ్స్‌ను నియంత్రించాలని ప్రధానికి ఎన్నో లేఖలు వచ్చాయి. స్పందించిన కేంద్రం డ్రగ్స్ నియంత్రణకు చర్యలు చేపట్టింది. డ్రగ్స్ మత్తులో యువత చిత్తవుతోంది. ఇప్పటికే చాలామంది యువత డ్రగ్స్‌కు బానిసయ్యారు. యువత భవిష్యత్ కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 11:55 AM