Share News

అశ్విని వైష్ణవ్‌తో కిషన్ రెడ్డి భేటీ.. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై చర్చ

ABN , Publish Date - May 21 , 2026 | 05:49 PM

కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. తెలంగాణలో రైల్వేప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై మాట్లాడారు.

అశ్విని వైష్ణవ్‌తో  కిషన్ రెడ్డి భేటీ.. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై చర్చ
Kishan Reddy

ఢిల్లీ, మే 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను (Ashwini Vaishnaw) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఈరోజు (గురువారం) ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. తెలంగాణలో రైల్వేప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై మాట్లాడారు. ఈ సమావేశంలో తెలంగాణలోని 42 ప్రధాన రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులకు సంబంధించి వివరంగా చర్చించారు. హైదరాబాద్ నగరంతో పాటుగా, చుట్టుపక్కల ప్రాంతాల ప్రయాణికులకు కీలకమైన రవాణా సౌకర్యంగా ఉన్న MMTS విషయంపై మాట్లాడారు. టైమింగ్స్ రెగ్యులరైజేషన్, సౌకర్యాలను మరింత మెరుగుపరిచేలా చొరవ తీసుకోవాలని తాను కోరానని.. దీనికి కేంద్ర రైల్వేమంత్రి సానుకూలంగా స్పందించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Kishan-Reddy.jpg


అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తదనుగుణంగా MMTS మెరుగుపరచడం కోసం చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కొత్త రైల్వేలైన్లు, హైస్పీడ్ రైల్ కారిడార్ పనుల పురోగతి తదితర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తోందని వెల్లడించారు. రానున్న రోజుల్లోనూ రైల్వేనెట్‌వర్క్ పెంచడం, ప్రజలకు సౌకర్యాల అభివృద్ధిలో పూర్తి సహకారం ఉంటుందని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు.

Kishan-Reddy-1.jpg


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేశాం: బండి సంజయ్‌

సరస్వతీ అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. భక్తులకు సీఎం శుభాకాంక్షలు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 21 , 2026 | 05:52 PM