Share News

భగీరథ్ లొంగిపోయారు.. విచారణ రాష్ట్ర పోలీసుల పరిధిలోనే ఉంది: కిషన్‌రెడ్డి

ABN , Publish Date - May 17 , 2026 | 02:01 PM

బండి భగీరథ్ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలిపారు. ఈకేసు విచారణ ఏదైనా ఉంటే పూర్తిగా తెలంగాణ పోలీసుల పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు.

భగీరథ్ లొంగిపోయారు.. విచారణ రాష్ట్ర పోలీసుల పరిధిలోనే ఉంది: కిషన్‌రెడ్డి
Kishan Reddy

హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): బండి భగీరథ్ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) స్పందించారు. భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలిపారు. ఈకేసు విచారణ ఏదైనా ఉంటే పూర్తిగా తెలంగాణ పోలీసుల పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు (ఆదివారం) హైదరాబాద్ వేదికగా మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగుతారా..? లేదా అనే దానిపై తాను కామెంట్ చేయలేనని చెప్పుకొచ్చారు. పచ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌లను ఆ రాష్ట్ర పోలీసులు గతంలో అడ్డుకున్నారని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అంతటి స్వతంత్ర వ్యవస్థ ఉంటుందని.. భగీరథ విషయంలో ఎలాంటి విచారణ అయిన చేయొచ్చని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: శ్రీధర్‌బాబు

ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి పొంగులేటి ప్రకటన

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 17 , 2026 | 02:15 PM