భారత్ సమ్మిట్‌పై కిషన్ రెడ్డి ఫైర్.. దేశ వ్యతిరేక శక్తులను పిలిచారంటూ విమర్శలు
ABN , Publish Date - Nov 14 , 2026 | 07:46 PM
హైదరాబాద్ వేదికగా జరిగిన భారత్ సమ్మిట్ కార్యక్రమంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశ వ్యతిరేక శక్తులను సమ్మి్ట్‌కు పిలిచారంటూ తీవ్రంగా విమర్శించారు.
హైదరాబాద్, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్ర రాజధాని కేంద్రంగా నవంబర్ 12 నుంచి 14 వరకు జరిగిన భారత్ సమ్మిట్ కార్యక్రమంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
‘భారత్ సమ్మిట్‌తో తెలంగాణకు ఏం ప్రయోజనం చేకూరింది. తెలంగాణను విమర్శించేందుకే సమ్మిట్ ఏర్పాటు చేశారా?.. దేశ వ్యతిరేక శక్తులను సమ్మిట్‌కు పిలిచారు. ప్రపంచ దేశాల ముందు భారత ఎన్నికల వ్యవస్థను చిన్నతనం చేస్తూ మాట్లాడారు. దేశంలో వ్యవస్థలన్నీ కుప్పకూలినట్లు రాహుల్ మాట్లాడారు. ఎమర్జెన్సీ సమయంలో ఎన్నికలు ఏ తరహాలో జరిగాయో అందరికీ తెలుసు. బీజేపీ ముఖ్య నాయకులను ఆ టైమ్‌లో జైల్లో పెట్టారు. మీరా ఎన్నికల వ్యవస్థ గురించి మాట్లాడేది. మేం అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదులను అణిచివేశాం’ అంటూ భారత్ సమ్మిట్‌పై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
ఇవి కూడా చదవండి...
చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం
Read Latest AP News And Telugu News