Share News

శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం

ABN , Publish Date - Nov 14 , 2026 | 10:46 AM

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం రేపింది. కెమెరా అమర్చిన కళ్లజోడుతో పుణెకు చెందిన ఓ భక్తుడు ఆలయంలోకి ప్రవేశించాడు.

శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం
Srikalahasti Temple

తిరుపతి, నవంబర్ 14: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం రేపింది. కెమెరా అమర్చిన కళ్లజోడుతో పుణెకు చెందిన ఓ భక్తుడు ఆలయంలోకి ప్రవేశించాడు. అమ్మవారి ఆలయంలో కళ్లజోడును అక్కడి పూజారులు గుర్తించారు. వెంటనే ఎస్పీఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందించారు. సదరు వ్యక్తి పుణెకు చెందిన అంకేష్ అగర్వాల్‌గా భద్రతా సిబ్బంది గుర్తించారు. ఆ భక్తుడు కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చిన సమయంలో అతడి కళ్లకు కెమెరా కళ్లజోడు ఉండటాన్ని పూజారులు గుర్తించారు.


పూజారులు ఇచ్చిన సమాచారం మేరకు భక్తుడిని అదుపులోకి తీసుకున్న ఎస్పీఎఫ్‌ సిబ్బంది విచారణ చేపట్టారు. అంకేష్ అగర్వాల్ రూ.5వేలు చెల్లించి రాహుకేతు పూజ చేయించుకున్నాడు. అనంతరం స్వామి వారి దర్శనం చేసుకున్నాడు. ఈ క్రమంలో స్వామివారి ఆలయంలోనూ వీడియోలు తీశారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో ఆలయ భద్రతా తనిఖీలపై మరోసారి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


శ్రీకాళహస్తి ఆలయంలోని అన్నప్రసాద పోటులో అగ్నిప్రమాదం జరిగిన తర్వాత.. 24 గంటల్లోనే మరో ఘటన చోటు చేసుకోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. కాగా.. ఆలయ గర్భగుడి, ప్రాంగణాల్లో ఫొటోలు, వీడియోలు తీయడం పూర్తి నిషేధం. భద్రతా కారణాల దృష్ట్యా ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఆలయంలోకి అనుమతించరు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆలయ అధికారులు, పోలీసులు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 11:08 AM