Share News

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

ABN , Publish Date - Nov 14 , 2026 | 09:48 AM

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
Childrens Day wishes

అమరావతి, నవంబర్ 14: జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. నేటి బాలలే రేపటి దేశానికి భవిత అని సీఎం అన్నారు. బాలల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తామని చంద్రబాబు తెలిపారు. చిన్నారుల చిరునవ్వులోని స్వచ్ఛత ఎప్పటికీ ఇలాగే ఉండాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.


బాలల అభ్యున్నతితోనే ప్రగతి: సీఎం చంద్రబాబు

‘జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నేటి బాలలే రేపటి యువత.. దేశానికి భవిత! వారి కలలను సాకారం చేసి, ప్రతిభను వెలికి తీసి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా తీర్చిదిద్దడం మన బాధ్యత. ఆధునిక సాంకేతికత, విజ్ఞానం, నైపుణ్యాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు నేర్పే విద్యను అందించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది. బాలల అభ్యున్నతితోనే రాష్ట్ర ప్రగతి.. దేశ ప్రగతి. వారి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తాం’ అని ఎక్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పోస్ట్ చేశారు.


భవిష్యత్‌కు పునాదులు చిన్నారులే: లోకేశ్

‘రేపటి గొప్ప భవిష్యత్‌కు పునాదులు మీరే. మీ కళ్లలోని అమాయకత్వం, మీ చిరునవ్వులోని స్వచ్ఛత ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా చిన్నారులందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని లోకేశ్ తెలిపారు.


నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు: పల్లా శ్రీనివాసరావు

palla-srinivas-rao.jpg

బాలల ఉజ్వల భవిష్యత్తే రాష్ట్ర, దేశ ప్రగతికి పునాది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని తెలిపారు. వారిలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించడం అందరి బాధ్యతగా చెప్పుకొచ్చారు. బాలల విద్య, ఆరోగ్యం, భద్రత, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్నారు.. చిన్నారుల అభ్యున్నతితోనే రాష్ట్రం, దేశం మరింత ప్రగతి సాధిస్తాయని పల్లా శ్రీనివాసరావు ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి...

హంగు ముడి!

ఏపీ ఆర్థికాభివృద్ధికి రవాణా సౌకర్యాలు కీలకం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 10:47 AM