Share News

ఏపీ ఆర్థికాభివృద్ధికి రవాణా సౌకర్యాలు కీలకం

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:38 AM

ఏపీ ఆర్థికాభివృద్ధికి గ్రీన్‌ ఫీల్డ్‌ కారిడార్లు, పోర్టుల అనుసంధానం, రింగ్‌ రోడ్లు కీలకం’ అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

ఏపీ ఆర్థికాభివృద్ధికి రవాణా సౌకర్యాలు కీలకం

  • రవాణా అనుసంధానం కోసమే ఔటర్‌ రింగ్‌: గడ్కరీ

విశాఖపట్నం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ‘ఏపీ ఆర్థికాభివృద్ధికి గ్రీన్‌ ఫీల్డ్‌ కారిడార్లు, పోర్టుల అనుసంధానం, రింగ్‌ రోడ్లు కీలకం’ అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధి ద్వారా పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన, ఆర్థిక ప్రగతికి మరింత ఊతం లభిస్తుందన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా శుక్రవారం ‘వికసిత్‌ భారత్‌ దిశగా రహదారులు: జాతీయ రహదారు లు, రవాణా వ్యవస్థ, ఏపీ అభివృద్ధి కారిడార్‌’ అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం రహదారులు, విద్యుత్‌, నీరు, రవా ణా, సమాచార వ్యవస్థల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది.

పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(టీవోటీ), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్స్‌(ఇన్విట్‌), సెక్యూరిటైజేషన్‌ వంటి విధానాలను వినియోగిస్తున్నాం. సాధారణ ప్రజలు కూడా జాతీయ రహదారుల అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టి, దేశ నిర్మాణంలో భాగస్వాములు కావా లి. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణకు కేంద్రం ప్రణాళికలు చేపడుతోంది. బెంగుళూరు-కడప-విజయవాడ కారిడార్‌, రాయ్‌పూర్‌-విశాఖ ఎకనామిక్‌ కారిడార్లు కీలకమైనవి’ అని వివరించారు.

హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం హైవే, బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ వే, ఖరగ్‌పూర్‌-విశాఖపట్నం-అమరావతి కారిడార్‌ అభివృద్ధి ప్రణాళికల గురించి ప్రస్తావించారు. ‘ప్రతిపాదిత అమరావతి ఔటర్‌రింగ్‌ రోడ్డు రాజధాని ప్రాంతం చుట్టూ రవాణా అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల పారిశ్రామిక పార్కు లు, లాజిస్టిక్స్‌ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతా యి. ఏపీలో చేపట్టిన వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టులతో పారిశ్రామిక పోటీతత్వం పెరగడంతోపాటు పెట్టుబడులు ఆకర్షించేందుకు వీలవుతుంది. వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనలో ఏపీ కీలకపాత్ర పోషిస్తుంది’ అని గడ్కరీ అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 06:38 AM