Share News

చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

ABN , Publish Date - Nov 14 , 2026 | 10:10 AM

చిత్తూరు జిల్లాలోని పలమనేరు గుడియాత్తం వద్ద ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
Palamaner Accident

చిత్తూరు, నవంబర్ 14: జిల్లాలోని పలమనేరు గుడియాత్తం వద్ద ఈరోజు (శనివారం) ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్రవాహనదారుడు.. ఓ బైక్‌ను, ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి యశ్వంత్‌ (25)గా గుర్తించారు. మృతుడు అతివేగంగా బైక్‌‌ను నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బైక్‌పై అతివేగంగా దూసుకొచ్చిన యశ్వంత్ అదుపుతప్పి మొదట ఆటోను ఢీకొట్డాడు. అనంతరం మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు.


ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన యశ్వంత్ ప్రమాద స్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు రామకుప్పం వాస్తవ్యుడిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ ఆర్థికాభివృద్ధికి రవాణా సౌకర్యాలు కీలకం

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 10:13 AM