పీవీ నరసింహారావుకు కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ ఘన నివాళులు
ABN , Publish Date - Jun 28 , 2026 | 02:04 PM
భారత మాజీ ప్రధాని, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి నేడు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు.. పీవీకి ఘన నివాళులు అర్పించారు.
హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): భారత మాజీ ప్రధాని, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు (PV Narasimha Rao) జయంతి నేడు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు.. పీవీకి ఘన నివాళులు అర్పించారు.
ఆర్థిక సంస్కరణలకు ఊతమిచ్చారు: కేసీఆర్
ఆర్థిక సంస్కరణలకు ఊతమిచ్చి, భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించిన తెలంగాణ ముద్దుబిడ్డ, బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నానని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమంలో కేసీఆర్ పోస్టు పెట్టారు.
దేశానికి అమూల్యమైన సేవలను పీవీ అందించారు: హరీశ్‌రావు
తెలంగాణ గర్వించే బిడ్డగా, అత్యుత్తమ పరిపాలనాదక్షుడిగా, భారత ప్రధానిగా దేశానికి అమూల్యమైన సేవలను భారతరత్న పీవీ నరసింహారావు అందించారని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. పీవీ జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నానని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమంలో హరీశ్‌రావు పోస్టు పెట్టారు.
దేశాన్ని భారీ ఆర్థిక సంక్షోభం నుంచి పీవీ గట్టెక్కించారు: కేటీఆర్
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు భారతరత్న పీవీ నరసింహారావు అని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. గడ్డుకాలంలో దేశాన్ని భారీ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారని కొనియాడారు. ఆయన తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని తెలిపారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ హయాంలో ఎంతో ఘనంగా నిర్వహించామని ప్రస్తావించారు. వెటర్నరీ యూనివర్శిటీకి పీవీ పేరు పెట్టామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమంలో కేటీఆర్ పోస్టు పెట్టారు.
నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్ అని పేరు పెట్టడమే కాకుండా.. పీవీ అజరామర కీర్తిని చాటిచెప్పే విధంగా వారి ఎత్తయిన విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేటీఆర్ తెలిపారు. అనేక ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రధానంగా దేశ ప్రగతిని ముందుకు నడిపించిన తత్వవేత్త పీవీ అని కొనియాడారు. అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగల బహుభాషా పండితుడని తెలిపారు. ఎన్ని అడ్డంకులనైనా సునాయాసంగా అధిగమించిన జ్ఞాన గని, సాటిలేని చాణక్యుడు పీవీ అని కేటీఆర్ అభివర్ణించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ రైజింగ్ విజన్‌కు ప్రపంచ దిగ్గజ కంపెనీల మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి
సీషెల్స్ పర్యటనలో గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News