కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు
ABN , Publish Date - Jun 11 , 2026 | 07:08 AM
కాచిగూడ రైల్వేస్టేషన్ నిర్మించి ఈ నెల 10వ తేదీకి 110 ఏళ్లు పూర్తయ్యాయి. ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌ను 1916 జూన్ 10న ప్రారంభించారు.
1916 జూన్ 10న ప్రారంభం
నిర్మాణంలో ప్రత్యేకత.. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు
హైదరాబాద్: కాచిగూడ రైల్వేస్టేషన్ నిర్మించి ఈ నెల 10వ తేదీకి 110 ఏళ్లు పూర్తయ్యాయి. ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌ను 1916 జూన్ 10న ప్రారంభించారు. నిజాం రాష్ట్ర రైల్వేకు ఈ స్టేషన్ ప్రధాన కేంద్రంగా ఉండేది. ఎంతో చరిత్ర గల ఈ స్టేషన్ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. చుట్టూ మీనార్ల మధ్యలో డోములతో గోతిక్ ఆర్కిటెక్చర్ శైలిలో స్టేషన్‌ను నిర్మించారు. రైల్వే స్టేషన్‌లో కొత్త భవనాలు నిర్మించినా చారిత్రక కట్టడాలకు నష్టం కలగకుండా దక్షిణ మధ్య రైల్వేప్రత్యేక చర్యలు తీసుకుంది.
ఈ రైల్వే స్టేషన్‌కు గ్రీనరీ ప్లాటినం, సోలార్ విద్యుత్, ఇందన పొదుపు, ఐజీబీసీ పర్యావరణ అవార్డులు లభించాయి. ఈ రైల్వే స్టేషన్ ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిరోజూ రూ.60 లక్షల ఆదాయం వస్తుంది. నిత్యం 50 వేల మంది ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్‌లో ఐదు ప్లాట్ ఫారాలు ఉన్నాయి. సోలార్ విద్యుత్ ద్వారా కరెంట్‌ను ఆదా చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News