స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - Jun 11 , 2026 | 06:45 AM
ఈ రోజు(గురువారం) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గింది.
ఇంటర్‌నెట్ డెస్క్: బంగారం ధరలు వరుసగా పతనం అవుతున్నాయి. నిన్న (బుధవారం) 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా 4300 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్లపై 3,950 రూపాయలు తగ్గింది. ఈ రోజు(గురువారం) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,48,850 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,36,440 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,11,630 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ఎంత తగ్గిందంటే..
ఈ రోజు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. 100 గ్రాముల వెండిపై 1000 రూపాయలు.. కేజీ వెండిపై 10 వేల రూపాయలు తగ్గింది. ఈ రోజు 100 గ్రాములపై పది రూపాయలు.. కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి 25,990 రూపాయల వద్ద.. కేజీ వెండి 2,59,900 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.