ఉక్కు ప్రమాదంలో మరో కార్మికుడి మృతి
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:55 AM
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులోని ఎస్‌ఎంఎస్-1 విభాగంలో సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో గాయపడిన కందుల పైడిరాజు అనే కార్మికుడు బుధవారం మృతిచెందాడు.
ఉక్కుటౌన్‌షిప్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులోని ఎస్‌ఎంఎస్-1 విభాగంలో సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో గాయపడిన కందుల పైడిరాజు అనే కార్మికుడు బుధవారం మృతిచెందాడు. సంఘటనా స్ధలంలోనే ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడగా, వారిలో తీవ్రంగా గాయపడిన కాంట్రాక్టు కార్మికులు జి.సూరిబాబు, కందుల పైడిరాజు, ఉద్యోగి పి.శ్రీనివాసరావును నగరంలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి, ఉద్యోగులు ఆర్.మల్లికార్జునరావు, జి.అర్జున అప్పారావు, బి.సత్యానంద్‌ను షీలానగర్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో గంగవరం ప్రాంతానికి చెందిన కందుల పైడిరాజు (57) బుధవారం ఉదయం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.