హైదరాబాద్లో దారుణం.. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళపై లైంగిక దాడి
ABN , Publish Date - Oct 17 , 2026 | 08:52 AM
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాయదుర్గం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ యువకుడు మాయమాటలు చెప్పాడు. ఇంటి పని ఇప్పిస్తానంటూ మహిళను అతడు నమ్మించి ఆటో ఎక్కించుకున్నాడు.
భర్తకు చెప్పి వస్తానన్నా వినకుండా సదరు మహిళను యువకుడు నమ్మించాడు. ఆటోలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ - 51కు తీసుకెళ్లాడు. చెట్లు దట్టంగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను అమీర్పేట యూసీహెచ్కు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నన్ను కిరాయి మనుషులతో కేటీఆర్ తిట్టిస్తున్నారు.. కవిత ధ్వజం
మొక్కజొన్న పంట మధ్యలో గంజాయి సాగు.. పోలీసుల ఉక్కుపాదం
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News