ఎన్టీఆర్ భుజానికి సర్జరీ విజయవంతం
ABN , Publish Date - Aug 12 , 2026 | 04:30 PM
ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో బుధవారం శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి అయిందని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR Health Update) భుజానికి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో బుధవారం శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి అయిందని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సర్జరీ అనంతరం ఎన్టీఆర్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.
భుజానికి సర్జరీ కారణంగా ఎన్టీఆర్ కొంతకాలం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఆరోగ్యం స్థిరంగా ఉందని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఎన్టీఆర్ భుజానికి ఇటీవల గాయమైందని కిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందంతో సంప్రదించి, తదుపరి సంరక్షణ అందించిన అనంతరం, ఆయన త్వరగా, పూర్తిగా కోలుకోవడానికి ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స ప్రయోజనకరంగా ఉంటుందని నిర్ధారించామని చెప్పారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్స్‌లో ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించిందని వెల్లడించారు.
ఆర్.ఎ.పూర్ణచంద్ర తేజస్వి, డా.నితిన్ బెజ్జంకి, డా.మధుసూదన్ రావు, డా.శ్రీనివాస్ రావు సూరపనేని ఈ సర్జరీని పూర్తి చేశారని కిమ్స్ వైద్యులు వివరించారు. శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమైందని, ఎన్టీఆర్ క్షేమంగా ఉన్నారని తెలియజేయడానికి తాము సంతోషిస్తున్నామని అన్నారు. ఆయన ఇప్పుడు వైద్య పర్యవేక్షణలో ఒక క్రమబద్ధమైన పునరావాస కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు. రెండు నుంచి మూడు నెలల కాల వ్యవధిలో ఎన్టీఆర్ పూర్తిగా కోలుకుని, తిరిగి సాధారణ స్థితికి వస్తారని తాము ఆశిస్తున్నారని కిమ్స్ వైద్యులు పేర్కొన్నారు.
మీ అందరి అండతో త్వరలో మీ ముందుకు వస్తా: ఎన్టీఆర్
తన భుజానికి సర్జరీ విజయవంతం కావడంపై కిమ్స్ వైద్య బృందానికి జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి అండతో త్వరలో మీ ముందుకు వస్తా. నా క్షేమం కోరుకున్న అందరికీ కృతజ్ఞతలు’ అని ఎక్స్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ పోస్టు పెట్టారు.
వార్తలు కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2 పనుల్లో వేగం పెంచాలి: సీఎం రేవంత్‌రెడ్డి
పత్తి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల
POB రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించొద్దు: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News