Share News

మాజీలు డీలా.. కేడర్‌ గోల..!

ABN , Publish Date - May 29 , 2026 | 09:51 AM

ఇద్దరు కీలక నేతల వ్యాఖ్యలు హైదరాబాద్ నగరంలో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నిరాశను ప్రతిబింబిస్తున్నాయి.

మాజీలు డీలా.. కేడర్‌ గోల..!
BRS Party, Telangana

  • గ్రేటర్‌ బీఆర్‌ఎస్‏లో వింత పరిస్థితి

  • పార్టీ కార్యక్రమాలపై మాజీ కార్పొరేటర్ల అనాసక్తి

  • నామ్‌ కే వాస్తేగా సమావేశాలకు హాజరు

  • సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌ పర్యవేక్షణ నేపథ్యంలో చర్చ

  • మాజీల తీరుపై బహిరంగంగా తలసాని అసహనం

  • ఇతర పార్టీలతో టచ్‌లో కొందరు..

హైదరాబాద్‌ సిటీ: ‘ప్రజల్లో ఉండండి.. పౌర సమస్యల పరిష్కారానికి ప్రయత్నించండి.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనండి.. వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఉరుకులాడి పని చేసే వారికే పోటీ చేసే అవకాశం’

  • ఇటీవల ప్రారంభమైన బీఆర్‌ఎస్‌ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

‘టికెట్‌ అవసరమున్నప్పుడు వినమ్రంగా వస్తారు. గెలిచాక మన కార్పొరేటర్లకు కొమ్ములు వస్తున్నాయి. కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. కొందరు మాజీ కార్పొరేటర్లు పార్టీ కార్యక్రమాలు చేయకుండా తప్పించుకుంటున్నారు. అలాంటి వారి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్‌ను కోరుతున్నా’

  • అంబర్‌పేటలో కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌


ఇద్దరు కీలక నేతల వ్యాఖ్యలు నగరంలో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నిరాశను ప్రతిబింబిస్తున్నాయి. ఎన్నికల సమయంలో టికెట్‌ కావాలని పోటీపడే నాయకులు.. అనంతరం మిన్నకుండి పోతున్నారు. పార్టీ నుంచి అవకాశం పొంది ఐదేళ్లు పదవి అనుభవించిన తాజా మాజీ, గత మాజీ కార్పొరేటర్లదీ అదే తీరు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను కొందరు అంతగా పట్టించుకోవడం లేదు. తెలంగాణ భవన్‌లో సమావేశాలకూ కొందరు గైర్హాజరవుతున్నారు. డివిజన్‌ స్థాయిలో జరిగే కార్యక్రమాలు నిర్వహించేందుకూ ఆసక్తి చూపడం లేదు. వివిధ పనుల నిమిత్తం వచ్చే పార్టీ శ్రేణులు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పించుకు తిరుగుతున్నారని కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ నాయకుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు, పార్టీ పరంగా ఎస్‌ఐఆర్‌ పరిశీలన సజావుగా జరుగుతుందా..? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.


అయినా.. వేచి చూద్దాం..

మరో ఆరు నెలల తరువాత ట్రై కార్పొరేషన్ల ఎన్నికలు జరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలు జరిగే అవకాశముందని తెలిసినా.. బీఆర్‌ఎస్‏కు చెందిన మాజీ కార్పొరేటర్లు, ఆశావహ నాయకులు ఇంకా వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి నుంచి ఖర్చు ప్టెటడం ఎందుకన్నది కొందరి ఆలోచన కాగా.. ఎమ్మెల్యేలపై అసంతృప్తితో ఇంకొందరు మనకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నగరంలో ఇలా..

  • కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో పలువురు మాజీ కార్పొరేటర్లు పార్టీ వ్యవహారాల్లో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాంలే అన్న వైఖరి కొందరిది కాగా.. ఎమ్మెల్యేపై అసంతృప్తితోనూ కొందరు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఇది సభ్యత్వ నమోదుపై ప్రభావం చూపే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది.

  • ఎల్‌బీనగర్‌లో మాజీ కార్పొరేటర్లలో మెజార్టీ పార్టీ కార్యక్రమాలు సొంతంగా నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. తమకు తగినంత ప్రాధాన్యం దక్కడం లేదని శాసనసభ్యుడి తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.


  • ముషీరాబాద్‌లో కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క డివిజన్‌లోనూ విజయం సాధించలేదు. 2016 నుంచి 2021 వరకు కార్పొరేటర్లుగా వ్యవహరించిన వారిలో కొందరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ పార్టీ కార్యక్రమాల నిర్వహణకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై కొందరు సీనియర్‌ నాయకులు గుర్రుగా ఉన్నారు. కొందరు మాజీ కార్పొరేటర్లదీ అదే తీరు. ఓ మాజీ కార్పొరేటర్‌ కాంగ్రెస్‏లో చేరతారని ప్రచారం జరుగుతోంది.


city3.3.jpg

  • అంబర్‌పేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, పలువురు మాజీ కార్పొరేటర్ల మధ్య కోల్డ్‌ వార్‌ కొనసాగుతోంది. గతంలోనూ పలు సందర్భాల్లో ఈ విషయం బహిర్గతమైంది. ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న వారితోపాటు.. ఆయన వెంట ఉండే మాజీ కార్పొరేటర్‌ కూడా పార్టీ కార్యక్రమాల్లో అంత చురుకుగా పాల్గొనడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఓ మాజీ కార్పొరేటర్‌ కాంగ్రె్‌సతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

  • ఉప్పల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు గతంలో కాంగ్రె్‌సలో చేరారు. ఆ డివిజన్లలో పార్టీ కార్యక్రమాల నిర్వహణపై అస్పష్టత కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ఎమ్మెల్యేలు లేని చోట..

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో పరిస్థితి కొంత గందరోగళంగా ఉంది. శేరిలింగంపల్లి పార్టీ ఇన్‌చార్జిగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యవహరిస్తుండగా.. ఓ మాజీ కార్పొరేటర్‌ పార్టీ శ్రేణులను సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌ కోసం పోలింగ్‌ కేంద్రాల వారీగా ఏజెంట్ల ఎంపికలో ఇబ్బందులున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజేంద్రనగర్‌లో పార్టీ వ్యవహారాలను పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.


కొందరు నాయకులు అంత క్రియాశీలకంగా లేకపోవడం పార్టీ కార్యక్రమాల నిర్వహణకు అవాంతరంగా మారుతోంది. గోషామహల్‌, కంటోన్మెంట్‌, పాతబస్తీలోని నియోజకవర్గాల్లో పార్టీ స్థానిక సీనియర్‌ నాయకులు సమన్వయం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియోజకవర్గానికో నాయకుడిని అధినేత కేసీఆర్‌ నియమించారు. వారి పర్యవేక్షణ, సమన్వయంతో డిజిటల్‌ మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ జరుగుతుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.


కొందరు నాయకులు అంత క్రియాశీలకంగా లేకపోవడం పార్టీ కార్యక్రమాల నిర్వహణకు అవాంతరంగా మారుతోంది. గోషామహల్‌, కంటోన్మెంట్‌, పాతబస్తీలోని నియోజకవర్గాల్లో పార్టీ స్థానిక సీనియర్‌ నాయకులు సమన్వయం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియోజకవర్గానికో నాయకుడిని అధినేత కేసీఆర్‌ నియమించారు. వారి పర్యవేక్షణ, సమన్వయంతో డిజిటల్‌ మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ జరుగుతుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు..

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 29 , 2026 | 11:12 AM