Share News

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురి మృతి..

ABN , Publish Date - May 29 , 2026 | 09:20 AM

కర్ణాటక చిత్రదుర్గ జిల్లా తుమకుర్లహళ్లి గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పేలిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురి మృతి..
Chitradurga Road Accident

కర్ణాటక: చిత్రదుర్గ జిల్లా తుమకుర్లహళ్లి గేట్ సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పేలిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను రాఘవేంద్ర, రుద్రేశ్, సోమ, మల్లికార్జున్, ప్రమోద్‌గా పోలీసులు గుర్తించారు. వీరు బళ్లారి నుంచి చల్లకెరెకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.


పోలీసుల కథనం ప్రకారం, మృతులు ఐదుగురు వ్యక్తిగత కారణాల నిమిత్తం కారులో బళ్లారికి వెళ్లారు. పని పూర్తయిన తర్వాత చల్లకెరెకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, మొలకల్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమకుర్లహళ్లి గేట్ వద్దకు రాగానే ప్రమాదవశాత్తూ కారు టైరు పేలింది. అనంతరం వేగంగా వెళ్తున్న కారు నియంత్రణ కోల్పోయి బీదర్-శ్రీరంగపట్న జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఇతర వాహనదారులు వెంటనే 108 అంబులెన్స్‌, పోలీసులకు సమాచారం అందించారు.


ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాద తీరును పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్త కూడా చదవండి

గుజరాత్‌లో దారుణం.. మంత్రిగత్తె పేరుతో మహిళ కుటుంబంపై దాడి..

ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఐదుగురి మృతి..

Updated Date - May 29 , 2026 | 09:24 AM