ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఐదుగురి మృతి..
ABN , Publish Date - May 29 , 2026 | 08:15 AM
ఉత్తర్ ప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుపాను కారణంగా బెత్వా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఐదుగురు కార్మికులు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తర్ ప్రదేశ్: హమీర్‌పూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుపాను కారణంగా బెత్వా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఐదుగురు కార్మికులు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కురారా పోలీస్ స్టేషన్ పరిధిలోని కందౌర్-మొరకందర్ బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగింది. వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా తుపాను కారణంగా బలమైన గాలులు వీచాయి. ఈ భారీ గాలులకు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కొంత భాగం కూలిపోయింది.
గాలుల ధాటికి వంతెన స్లాబ్, పిల్లర్‌తో పాటు స్కాఫోల్డింగ్ నిర్మాణం కూలిపోయింది. దీంతో దాని కింద పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. వారిలో ఐదుగురు మృతిచెందినట్లు స్థానిక అధికారులు నిర్ధారించగా.. చాలా మంది కార్మికులు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమాచారం మేరకు పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాలను తొలగిస్తూ కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
గుజరాత్‌లో దారుణం.. మంత్రిగత్తె పేరుతో మహిళ కుటుంబంపై దాడి..