Share News

పిల్లల కిడ్నీలో రాళ్లు !

ABN , Publish Date - May 29 , 2026 | 08:37 AM

పిజ్జా, బర్గర్‌ టేస్టీగా ఉందని పిల్లలు ఎడాపెడా తింటున్నారా? వద్దన్నా కూల్‌ డ్రింక్స్‌ తాగుతున్నారా?.. అదేపనిగా ఫాస్ట్‌ ఫుడ్‌, అల్ట్రా ఫుడ్‌ తీసుకుంటే చిన్నారుల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పిల్లల కిడ్నీలో రాళ్లు !
Kidney stones in children

  • ఎక్కువగా తీసుకునే అల్ట్రా ఫుడ్‌, కూల్‌డ్రింక్సే కారణం

  • జన్యు, మెటబాలిక్‌ సమస్యలతో కూడా..

  • 20 మందిలో నలుగురు బాధితులే..

  • 4 నుంచి 15 ఏళ్ల లోపు వారిలోనే అధికం

  • నీళ్లు తక్కువగా తాగడంతో పెరుగుతున్న ముప్పు

హైదరాబాద్‌ సిటీ: పిజ్జా, బర్గర్‌ టేస్టీగా ఉందని పిల్లలు ఎడాపెడా తింటున్నారా? వద్దన్నా కూల్‌ డ్రింక్స్‌ తాగుతున్నారా?.. అదేపనిగా ఫాస్ట్‌ ఫుడ్‌, అల్ట్రా ఫుడ్‌ తీసుకుంటే చిన్నారుల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు కిడ్నీఫెయిల్యూర్‌కు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు కూల్‌ డ్రింక్స్‌ తాగిస్తే కాల్షియం పెరిగి కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయని, సాల్ట్‌కు సంబంధించిన ఆహారం ఎక్కువగా తింటే అది మూత్రనాళాలల్లో పేరుకుపోయి రాళ్లుగా మారుతున్నాయని చెబుతున్నారు. పిల్లల డైట్‌, జన్యు, మెటబాలిక్‌ అంశాలు కిడ్నీలో స్టోన్స్‌ ఏర్పడటానికి కారణమవుతున్నాయి. 4 నుంచి 15 ఏళ్లలోపు వారిలో కూడా కిడ్నీలో రాళ్లు వస్తున్నాయి. వైద్యుడి వద్దకు 20 మంది పిల్లలు వస్తే నలుగురికి కిడ్నీలో రాళ్లు ఉంటున్నాయని నివేదికలు చెబుతున్నాయి. తొందరగా గుర్తించకపోతే తీవ్రమైన నొప్పి, ఇన్ఫెక్షన్‌, దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు వచ్చే ప్రమాదముంది.


ఫాస్ట్‌ ఫుడ్‌ పెద్ద శత్రువు

పిల్లల కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి 50 శాతం తీసుకునే ఆహారమైతే, మిగతావి ఇతర కారణాలు. ప్రస్తుత జనరేషన్‌ పిల్లలు ఎక్కువగా అలా్ట్రఫుడ్‌, కూల్‌ డ్రింక్స్‌, సాల్ట్‌ ఫుడ్‌ తీసుకుంటున్నారు. దీని వల్ల నీళ్లు తాగడం తక్కువ చేస్తున్నారు. ఇది డీ హైడ్రేషన్‌ ఏర్పడటానికి కారణమవుతుంది. ఉప్పు ఉన్న ఆహారం వల్ల మూత్రంలో కాల్షియం పెరిగి కిడ్నీలో రాళ్లుగా మారుతాయి. పిల్లలు మూత్రం వచ్చినప్పుడు పోయకుండా ఆపుకోవడం వల్ల కూడా రాళ్లుగా మారే ముప్పు ఉంది.


జన్యు, మెటబాలిక్‌ ఎఫెక్ట్‌

ఆహారమే కాకుండా వంశపారంపర్యం, మెటబాలిక్‌ వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి. ఐదేళ్ల పిల్లల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే తప్పని సరిగా జన్యు సంబంధిత కారణాలుగా భావించాలి. ఇలాంటి పిల్లలకు పదే పదే రాళ్లు ఏర్పతాయి. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఎవరికైనా కిడ్నీలో రాళ్లు ఉన్నాయో, పిల్లల ఎదుగుదల బాగానే ఉందా అనేది పరిశీలించాల్సి ఉంటుంది. యూరిక్‌ యాసిడ్‌ వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి.


city2.jpgకిడ్నీలో స్టోన్‌ ఉంటే...

కిడ్నీలో స్టోన్‌ ఉంటే యూరిన్‌లో బ్లడ్‌ వస్తుంది. తరచుగా కడుపు నొప్పి వస్తుంది. అలా్ట్రసౌండ్‌ స్కాన్‌ చేయిస్తే విషయం తెలుస్తుంది. చాలా మంది పిల్లలు యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుంటారు. మూత్ర నాళాల్లో అడ్దంకులు ఉంటే ఇన్‌ఫెక్షన్‌ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలకు మూత్రం విసర్జనలో ఇబ్బంది, జ్వరం, వణుకు, నిరంతరం వాంతులుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.


పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి

పిల్లల మూత్ర విసర్జనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. పదేపదే కడుపు నొప్పి వస్తే దానిని గ్యాస్ట్రిక్‌ సమస్యగా భావించొద్దు. 4 నుంచి 15 ఏళ్ల వయస్సు వారిలో మూత్ర సంబంధిత సమస్యలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించాలి. పెద్దలతో పోలిస్తే పిల్లలకు సాధారణ ఎండోస్కోపీ సరిపోదు. చిన్న రాళ్లకు షాక్‌ వేవ్‌ లిథోట్రిప్సీ వంటి పద్ధతులు ఉపయోగిస్తారు. పిల్లలు స్కూల్‌లో ఉండడం, ఆట పాటలలో నిమగ్నం కావడం వల్ల ఎక్కువగా నీళ్లను తాగరు. ఇది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగాలే తల్లిదండ్రులు చూస్తే కొంతవరకు కిడ్నీలో రాళ్లు రాకుండా కాపాడు కోవచ్చు.

  • డాక్టర్‌ శృతి బాల, పీడియాట్రిక్‌ నెఫ్రాలజిస్టు, రెయిన్‌బో చిల్డ్రన్‌ హాస్పిటల్‌


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు..

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 29 , 2026 | 10:43 AM