Share News

నేడు ఇళయరాజా కచేరి

ABN , Publish Date - Mar 28 , 2026 | 07:39 AM

హైదరాబాద్‏లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం సాయంత్రం ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా కచేరిని నిర్వహించనున్నారు.

నేడు ఇళయరాజా కచేరి

  • ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ: గచ్చిబౌలి స్టేడియంలో శనివారం సాయంత్రం ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా(Ilaiyaraaja) కచేరిని నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ఐటీ కారిడార్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులుంటాయని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌, గచ్చిబౌలి స్టేడియం, హెచ్‌సీయూ గేట్‌ నంబరు.2, లింగంపల్లి మార్గంలో వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించినట్లు తెలిపారు. గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి వచ్చే వాహనాలను ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వద్ద ఐఎస్‏బీ రోడ్డు వైపు మళ్లించి విప్రో సర్కిల్‌, గౌలిదొడ్డి, లింగంపల్లి వైపు వెళ్లేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.


city2.2.jpgఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌ వైపు నుంచి ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వైపు వచ్చే వాహనాలను విప్రో జంక్షన్‌ వద్ద నానక్‌రాంగూడ రోటరీ-2 వైపు మళ్లించి, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్లేలా.. అలాగే లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలను మజీద్‌బండ, శ్రీరాంనగర్‌, బొటానికల్‌ గార్డెన్‌ మీదుగా మెహిదీపట్నం వెళ్లేలా ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలుంటాయని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మార్కెట్‌కు చమురు మంట

త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 28 , 2026 | 07:39 AM