Share News

గోల్డ్, సిల్వర్ ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Mar 28 , 2026 | 06:57 AM

గత రెండు రోజులుగా బంగారం ధరలు దాదాపుగా స్థిరంగా ఉన్నప్పటికీ వెండి మాత్రం భారీగా పతనమైంది. మరి నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

గోల్డ్, సిల్వర్ ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
Gold, Silver Rates on March 28

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఇటీవల కాలంలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన బంగారం ధరలో గత రెండు రోజుల్లో స్వల్ప మార్పులు మాత్రమే చోటుచేసుకున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మార్చి 28) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,720గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,32,660గా ఉంది. కిలో వెండి ప్రస్తుతం రూ.2,44,900ల వద్ద కొనసాగుతోంది. నిన్న నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.160ల మేర, 22 క్యారెట్ల బంగారం ధర రూ.150ల మేర పెరిగింది. వెండి మాత్రం ఏకంగా రూ.15 వేల మేర పడిపోయింది.

మరోవైపు, శుక్రవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్ఠాన్ని తాకింది. రూ.94.85ల వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర 4,492 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. ఔన్స్ వెండి ధర 69 డాలర్లుగా ఉంది.


ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి (24 క్యారెట్లు, 22 క్యారెట్లు) ధరలు

  • చెన్నై: ₹1,46,520; ₹1,34,310

  • ముంబై: ₹1,44,720; ₹1,32,660

  • న్యూఢిల్లీ: ₹1,44,870; ₹1,32,810

  • కోల్‌కతా: ₹1,44,720; ₹1,32,660

  • బెంగళూరు: ₹1,44,720; ₹1,32,660

  • హైదరాబాద్: ₹1,44,720; ₹1,32,660

  • విజయవాడ: ₹1,44,720; ₹1,32,660

  • కేరళ: ₹1,44,720; ₹1,32,660

  • పుణె: ₹1,44,720; ₹1,32,660

  • వడోదరా: ₹1,44,770; ₹1,32,710

  • అహ్మదాబాద్: ₹1,44,770; ₹1,32,710

వెండి (కిలో) ధరలు

  • చెన్నై: ₹2,44,900

  • ముంబై: ₹2,39,900

  • న్యూఢిల్లీ: ₹2,39,900

  • కోల్‌కతా: ₹2,39,900

  • బెంగళూరు: ₹2,39,900

  • హైదరాబాద్: ₹2,44,900

  • విజయవాడ: ₹2,44,900

  • కేరళ: ₹2,44,900

  • పుణె: ₹2,39,900

  • వడోదరా: ₹2,39,900

  • అహ్మదాబాద్: ₹2,39,900


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ఈ వార్తలూ చదవండి:

మార్కెట్‌కు చమురు మంట

కొత్త కనిష్ఠానికి రూపీ

Updated Date - Mar 28 , 2026 | 07:25 AM