Share News

రాములోరి కల్యాణంలో నేతల ఆత్మీయ కలయిక

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:57 AM

శ్రీరామ నవమి వేడుకలు వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రాచీన ఖిల్లా రఘునాథ ఆలయంలో....

రాములోరి కల్యాణంలో నేతల ఆత్మీయ కలయిక

సుభాష్‌నగర్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): శ్రీరామ నవమి వేడుకలు వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రాచీన ఖిల్లా రఘునాథ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవం ఈ అరుదైన దృశ్యానికి వేదికైంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ దంపతులు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత దంపతులు, బీజేపీ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త ఈ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. నిత్యం పరస్పర విమర్శలు చేసుకునే ఈ నేతలు, స్వామివారి కల్యాణ వేళ ఆత్మీయంగా పలకరించుకోవడం విశేషం. ముఖ్యంగా మహేశ్‌ కుమార్‌గౌడ్‌ సతీమణి సంధ్య, కల్వకుంట్ల కవిత ఒకరి క్షేమ సమాచారాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. కల్యాణం అనంతరం నేతలు పరస్పరం గౌరవించుకుంటూ మాట్లాడుకోవడం అక్కడికి వచ్చిన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.

Updated Date - Mar 28 , 2026 | 05:57 AM