1.23 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా రక్షణ
ABN , Publish Date - Mar 25 , 2026 | 07:09 AM
గండిపేట మండలంలో దాదాపు 1.23 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా కాపాడింది. ఆ స్థలం విలువు దాదాపు రూ.60 కోట్లు ఉంటుందని సెక్రటేరియట్ కాలనీవాసులు పేర్కొన్నారు.
స్థలం విలువ రూ. 60 కోట్లు
హైదరాబాద్: గండిపేట మండలంలో దాదాపు 1.23 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా(HYDRAA) కాపాడింది. ఆ స్థలం విలువు దాదాపు రూ.60 కోట్లు ఉంటుందని సెక్రటేరియట్ కాలనీవాసులు పేర్కొన్నారు. గండిపేట మండలం, పుప్పాలగూడ సెక్రటేరియట్ కాలనీ పందెం వాగు పక్కన సర్వే నంబర్ 75లో 1.37 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ స్థలంలో ఇప్పటికే 14 గుంటలు ఆక్రమణకు గురి కాగా, ప్రస్తుతం 1.23 ఎకరాలు ఉంది. స్థానిక నాయకుల మద్దతుతో ఓ బిల్డర్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, అక్కడ లేబర్ అడ్డా, బిల్డింగ్ మెటీరియల్ పెడుతున్నాడు.
ఆ స్థలం తమదేనంటూ కొంతమంది బడాబాబులు హంగామా చేశారు. దాంతో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేయగా కమిషనర్ రంగనాథ్(Commissioner Ranganath) పరిశీలించారు. క్షేత్రస్థాయి విచారణలో అది ప్రభుత్వ భూమి అని నిర్ధారణకు వచ్చారు. మంగళవారం హైడ్రా అధికారులు సిబ్బందితో స్థలం వద్దకు వచ్చి బిల్డింగ్ మెటీరియల్ తొలగించి, ప్రభుత్వ స్థలమని బోర్డులను పెట్టించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
941 కోట్లతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్
Read Latest Telangana News and National News