రెండు పార్కులను కాపాడిన హైడ్రా
ABN , Publish Date - Apr 03 , 2026 | 07:34 AM
అమీన్‌పూర్ మండలంలో రెండు పార్కులను హైడ్రా గురువారం కాపాడింది. సర్వే నంబరు 152, 153లో 15 ఎకరాల మేర 144 పాట్లతో శ్రీ వెంకటరమణ కాలనీ పేరిట లేఔట్ వేశారు.
హైదరాబాద్ సిటీ: అమీన్‌పూర్ మండలంలో రెండు పార్కులను హైడ్రా గురువారం కాపాడింది. సర్వే నంబరు 152, 153లో 15 ఎకరాల మేర 144 పాట్లతో శ్రీ వెంకటరమణ కాలనీ పేరిట లేఔట్ వేశారు. మునోత్ ప్రైవేట్ ట్రస్ట్‌కు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న ఫవర్‌లాల్ లేఔట్ వేశారు. 2012లో ఆ బాధ్యతలు చేపట్టిన మహాకుమార్ జైన్ ఇందులో 7 ఎకరాలను వ్యవసాయ భూమిగా పేర్కొంటూ అమ్మేశారు. దీంతో కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
దీనికి సంబంధించిన వివాదం కోర్టులో ఉంది. మిగిలిన 8 ఎకరాల లే ఔట్‌లోని రెండు పార్కులను కబ్జా చేసే అవకాశం ఉందని, కాపాడాలని కోరారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో హైడ్రా, వివిధ శాఖల అధికారులు పరిశీలించి పార్కు స్థలాలను గుర్తించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అవి పార్కు స్థలాలుగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. హైడ్రా కాపాడిన పార్కు స్థలాల విలువ సుమారు రూ.47 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!
Read Latest Telangana News and National News