రేపటి విశ్వనగరం అమరావతి: సానా సతీశ్
ABN , Publish Date - Apr 03 , 2026 | 07:18 AM
‘‘అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు.. 5కోట్ల మంది ఆంధ్రుల గుండె చప్పుడు’’ అని టీడీపీ ఎంపీ సానా సతీశ్‌బాబు స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు.. 5కోట్ల మంది ఆంధ్రుల గుండె చప్పుడు’’ అని టీడీపీ ఎంపీ సానా సతీశ్‌బాబు స్పష్టం చేశారు. చంద్రబాబు సంకల్పమైన అమరావతి రేపటి విశ్వనగరమని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని నాశనం చేసిందని, ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన పవిత్ర భూమి చుట్టూ ముళ్ల కంచెలు వేసి విధ్వంసం సృష్టించిందని మండిపడ్డారు. ‘ప్లాన్-బి’ పేరుతో జగన్ కొత్త రాగం అందుకోవడం ఆయన చంచల మనస్తత్వానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. అమరావతి కోసం నారా భువనేశ్వరి తన బంగారు గాజులు త్యాగం చేసి ఉద్యమానికి ఊపిరి పోశారని గుర్తుచేశారు. ‘నాడు రాముడికి హనుమంతుడు తోడు నిలిచినట్లుగా, నేడు ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, లోకేశ్ అండగా నిలిచారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం వీరిద్దరూ పోరాడుతున్నారు’ అని తెలిపారు.