Share News

ఏపీ ఆత్మగౌరవ గర్జన: బీద మస్తాన్‌రావు

ABN , Publish Date - Apr 03 , 2026 | 07:20 AM

అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు కేవలం ఒక చట్టం మాత్రమే కాదని, రైతుల త్యాగాలను ఎన్నటికీ మరువబోమని వారికిచ్చే నైతిక వాగ్దానమని టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అభివర్ణించారు.

ఏపీ ఆత్మగౌరవ గర్జన: బీద మస్తాన్‌రావు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు కేవలం ఒక చట్టం మాత్రమే కాదని, రైతుల త్యాగాలను ఎన్నటికీ మరువబోమని వారికిచ్చే నైతిక వాగ్దానమని టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అభివర్ణించారు. ఈ బిల్లు ఆంధ్రుల ఆత్మ, అస్తిత్వానికి ప్రతీకగా పేర్కొన్నారు. ‘అమరావతి ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవ గర్జనకు ప్రతిరూపం. 5కోట్ల మంది ప్రజల గుండెల్లో తలెత్తిన నినాదం. అమరావతి రాజధాని త్యాగాల పునాదులపైనిర్మితమవుతోంది. ఇది మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. 2019-24 వరకు ఏపీ ఒక చీకటి కాలాన్ని అనుభవించింది. రాజధాని కోసం శాంతియుతంగా పోరాడిన రైతులపై 3,000కు పైగా కేసులు పెట్టారు. రైతులు తమ గ్రామాల్లో తిరగడానికి కూడా ఐడీ కార్డులు చూపించాల్సిన దుస్థితిని కల్పించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలో, ప్రధాని మోదీ మార్గనిర్దేశంలో ఏపీ మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తోంది’ అని బీద మస్తాన్‌రావు పేర్కొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 07:20 AM