Share News

వికసిత ఆంధ్రకు అమరావతి అవసరం: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌

ABN , Publish Date - Apr 03 , 2026 | 07:13 AM

భవ్యమైన రాజధాని నిర్మాణం కోసం వేలాది మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా త్యాగం చేశారని, వారి కలలను సాకారం చేయడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని ...

వికసిత ఆంధ్రకు అమరావతి అవసరం: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): భవ్యమైన రాజధాని నిర్మాణం కోసం వేలాది మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా త్యాగం చేశారని, వారి కలలను సాకారం చేయడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు. ‘వికసిత భారత్‌’ సంకల్పంలో భాగంగా ‘వికసిత ఆంధ్ర’ను నిర్మించాలంటే ఒక గొప్ప రాజధానిగా అమరావతి అవసరమని అభిప్రాయపడ్డారు. గురువారం రాజ్యసభలో ఏపీ పునర్వ్యస్థీకరణ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడారు. 2019లో అధికారంలోకి వచ్చిన పిల్ల కాంగ్రెస్‌ అయిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టిందని, రైతుల త్యాగాలను అగౌరవపరిచిందని విమర్శించారు.

Updated Date - Apr 03 , 2026 | 07:15 AM