Share News

2.2 లక్షల ట్యాంకర్లు.. అక్టోబర్‌లో బుకింగ్‌ల సంఖ్య

ABN , Publish Date - Nov 06 , 2026 | 07:39 AM

సాధారణంగా వేసవిలో నెలకు ట్యాంకర్ల బుకింగ్‌లు రెండు లక్షల పైగా ఉంటాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా వాటర్‌బోర్డు చరిత్రలోనే తొలిసారిగా అక్టోబరు నెలలో 2.2 లక్షల ట్యాంకర్లు బుక్‌ అయ్యాయి.

2.2 లక్షల ట్యాంకర్లు.. అక్టోబర్‌లో బుకింగ్‌ల సంఖ్య
Hyderabad Water Tankers

  • గతేడాది అదే నెలలో కేవలం 87వేలే

హైదరాబాద్‌ సిటీ: సాధారణంగా వేసవిలో నెలకు ట్యాంకర్ల బుకింగ్‌లు రెండు లక్షల పైగా ఉంటాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా వాటర్‌బోర్డు చరిత్రలోనే తొలిసారిగా అక్టోబరు నెలలో 2.2 లక్షల ట్యాంకర్లు బుక్‌ అయ్యాయి. గతేడాది ఇదే నెలలో 87 వేల ట్యాంకర్లే బుక్‌ కావడం గమనార్హం. ఎల్‌నినో నేపథ్యంలో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు పెరగక పోగా ఎండల తీవ్రతతో రోజురోజుకు పడిపోతున్నాయి.


city3.2.jpgదీంతో అక్టోబరు నెల నుంచే ప్రతీరోజు 7వేలకు పైగా ట్యాంకర్లు బుక్‌ అవుతున్నాయి. ఐటీ కారిడార్‌లోని మాదాపూర్‌, గచ్చిబౌలి, టీఎన్‌జీఓ్‌స కాలనీ ప్రాంతాల్లో వేసవి మాదిరిగానే ప్రతీరోజు ఒక్కో ఫిల్లింగ్‌ స్టేషన్‌కు 250 నుంచి 300 వరకు ట్యాంకర్లు వెళ్తున్నాయి. వాస్తవానికి వర్షాకాలంలో ట్యాంకర్లకు డిమాండ్‌ ఉండదు. 1500 నుంచి 2వేల లోపు మాత్రమే ప్రతీరోజు బుక్‌ అయ్యేవి. కానీ ఎల్‌నినో నేపథ్యంలో పరిస్థితులు భిన్నంగా మారాయి. భూగర్భ జలాలు పడిపోవడంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో బోర్లు పోయడం లేదు. కొన్ని ఆగి పోస్తున్నాయి. మరికొన్ని పూర్తిగా బంద్‌ అయ్యాయి. అపార్ట్‌మెంట్‌, ఇతర అవసరాలకు నీళ్లు సరిపోకపోవడంతో ట్యాంకర్లను బుక్‌ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

16 నుంచి కొండగట్టు అంజన్న చందనోత్సవం

బీసీల భవనాలను అమ్మేందుకు రేవంత్‌ కుట్ర

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 07:39 AM