Share News

బంగ్లాదేశ్‌లోని వీడియో అమరావతిదని ప్రచారం

ABN , Publish Date - Nov 06 , 2026 | 07:06 AM

ఇటీవల కురిసిన వర్షాలకు రాజధాని మునిగిపోయిందంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారాన్ని మంత్రి లోకేశ్‌ వాస్తవాలతో ఎండగట్టారు.

బంగ్లాదేశ్‌లోని వీడియో అమరావతిదని ప్రచారం

  • వాస్తవాలతో ఎండగట్టిన లోకేశ్‌

అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన వర్షాలకు రాజధాని మునిగిపోయిందంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారాన్ని మంత్రి లోకేశ్‌ వాస్తవాలతో ఎండగట్టారు. బంగ్లాదేశ్‌లో నీట మునిగిన ప్రాంతాల వీడియోని అమరావతిలో ప్రాంతాలంటూ వైసీపీ నేతలు ప్రచారం చేయడంపై లోకేశ్‌ స్పందించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఫొటోలతోసహా వివరిస్తూ... ‘నిజం గడపదాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందన్న నానుడి వైసీపీ ఫేక్‌ ముఠాలకు వర్తిస్తుంది. తప్పుడు ప్రచారాలతో అమరావతి అభివృద్ధిని అడ్డుకోలేరు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 07:06 AM