అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ
ABN , Publish Date - Nov 06 , 2026 | 01:21 AM
Gollapeta.. Staying away from voting ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడం లేదని నిరసిస్తూ టెక్కలిపాడు పంచా యతీ గొల్లపేట గ్రామస్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ను బహిష్కరించారు.
గొల్లపేట గ్రామస్థుల నిర్ణయం..
294 మంది ఓటింగ్‌కు దూరం
టెక్కలిపాడు పోలింగ్ కేంద్రంలో 609 ఓట్లకు 238 మాత్రమే పోలింగ్
జలుమూరు, నవంబరు 5(ఆంధ్రజ్యోతి):
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడం లేదని నిరసిస్తూ టెక్కలిపాడు పంచా యతీ గొల్లపేట గ్రామస్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ను బహిష్కరించారు. గురువారం టెక్కలిపాడులోని 65వ నంబరు పోలింగ్ కేంద్రంలో 609 మంది ఓటు వేయాల్సి ఉండగా, గొల్లపేటకు చెందిన 294 మందిలో ఒక్కరూ ఓటు వేసేందుకు రాలేదు. దీంతో కేవలం 238 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గ్రామస్థుల నిర్ణయం గురించి తెలుసుకున్న డిప్యూటీ ఎంపీడీవో దేవేంద్రవర్మ, వీఆర్వో రాజు, గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి గొల్లపేటకు వెళ్లారు. ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. అయితే ఎవరు అధికారంలోకి వచ్చినా తమ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని గ్రామస్థులు స్పష్టం చేశారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ పదవిని తమ గ్రామానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగారు.