బీసీల భవనాలను అమ్మేందుకు రేవంత్ కుట్ర
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:20 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి భూములపై తప్ప పాలనపై ఉండటంలేదని, బీసీ ఆత్మగౌరవ భవనాలను అమ్ముకునేందుకు ఆయన కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.
జీఓ 14 రద్దు చేయాలి: బీఆర్‌ఎస్
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి భూములపై తప్ప పాలనపై ఉండటంలేదని, బీసీ ఆత్మగౌరవ భవనాలను అమ్ముకునేందుకు ఆయన కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు మధుసూదనాచారి, వివేకానంద, దాసోజు శ్రావణ్ గంగుల కమలాకర్ గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన బీసీ ఆత్మగౌరవ భవనాలపై ఆయన కన్ను పడిందని, వాటిని అమ్మేందుకే. జీఓ 14 తెచ్చారన్నారు. రాష్ట్రం రియల్‌ఎస్టేట్ బ్రోకర్ చేతుల్లోకి పోయిందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News