Share News

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

ABN , Publish Date - Nov 06 , 2026 | 03:59 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. శనివారం నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రూ.9,053 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు పలు భవనాలను ఆయన ప్రారంభించనున్నారు.

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Revanth Reddy

  • 3 రోజులపాటు పలు కార్యక్రమాలకు హాజరు

  • 9,053 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భవనాల ప్రారంభోత్సవాలు

  • 9న హకీంపేటలో రైతు సభ..

  • విస్తృత ఏర్పాట్లు

హైదరాబాద్‌/కొడంగల్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. శనివారం నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రూ.9,053 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు పలు భవనాలను ఆయన ప్రారంభించనున్నారు. శనివారం (7వ తేదీ) ఉదయం వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో మెగా రైతు మేళా, ఇండస్ర్టియల్‌ ఎక్స్‌పోలను సీఎం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమవుతారు. అక్కడి నుంచి కొడంగల్‌ చేరుకుని, రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం(8వ తేదీ) ఉదయం మళ్లీ హకీంపేట చేరుకుని స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమవుతారు. సీఎం జన్మదినం సందర్బంగా కొడంగల్‌లోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. సీఎం పర్యటన సందర్భంగా మొత్తం రూ.9,053 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


రూ.5,060 కోట్లతో నిర్మించనున్న రేడియల్‌ రోడ్డు-2, ఎస్‌డీఎఫ్‌ కింద రూ.1,410 కోట్లతో 223 బీటీ రోడ్లు, రూ.2,100 కోట్లతో మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పథకం ఫేజ్‌-2 పనులు, రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు, రూ.41.83 కోట్లతో కొడంగల్‌, కోస్గి, మద్దూర్‌లో ఆధునిక బస్టాండ్‌లు, తిమ్మారెడ్డిపల్లిలో రూ.4.45 కోట్లతో గురులోక్‌ మసంద్‌ ప్రణభు మందిరం అభివృద్ధి, రూ.5.10 కోట్లతో కొడంగల్‌ నిరంజన మఠం అభివృద్ధి, రూ.20 కోట్లతో మద్దూర్‌లో ఎన్‌ఏసీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌, రూ.59.30 కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణం, రూ.10కోట్లతో హకీంపేట ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో టూరిజం హోటల్‌, రూ.20కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ డివిజన్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌, రూ.123 కోట్లతో కొడంగల్‌ వ్యవసాయ కళాశాల భవనం, రూ.81కోట్లతో ఎకో పామ్‌ ఆయిల్‌ కంపెనీ నిర్మాణం తదితర పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే, రూ.46.08 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 10 ప్రభుత్వ భవనాలను ప్రారంభించనున్నారు. 9 తేదీ రాత్రి 7 గంటల వరకు హకీంపేటలో నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌, మేడ్చల్‌ జిల్లాల నుంచి 50వేల మంది రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు: మంత్రి పొంగులేటి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 04:08 AM