Share News

బిడ్డా... ఎక్కడున్నావ్‌.. ఏమైపోయావ్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 07:06 AM

అమెరికాలో ఉంటూ ప్రతిరోజూ ఫోన్‌చేసి యోగక్షేమాలు తెలిపే తమ కూతురు కనిపించకుండా పోవడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

బిడ్డా... ఎక్కడున్నావ్‌.. ఏమైపోయావ్‌
Koya Sreeja

  • అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న శ్రీజ మిస్సింగ్‌

  • వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాలేదని స్నేహితుల సమాచారం

  • కుమార్తె జాడ కోసం తల్లిదండ్రుల వేదన

  • స్వగ్రామం నల్లగొండ జిల్లా కనగల్‌లో విషాదం

కనగల్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఉంటూ ప్రతిరోజూ ఫోన్‌చేసి యోగక్షేమాలు తెలిపే తమ కూతురు కనిపించకుండా పోవడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న నల్లగొండ జిల్లాకు చెందిన కోయ శ్రీజ (23) జాడ మూడు రోజులుగా కనిపించం లేదు. ఈ నెల 2వ తేదీన వాకింగ్‌కు వెళ్తున్నానని బయటకు వెళ్లి తిరిగి రాలేదని అమెరికాలో ఉంటున్న ఆమె స్నేహితులు శ్రీజ తల్లిదండ్రులకు సమాచారమివ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం శాబ్దులాపురం గ్రామానికి చెందిన రైతు కోయ యాదగిరిరెడ్డి, రూప దంపతుల ఏకైక కుమార్తె కోయ శ్రీజ ఎంఎస్‌ చదివేందుకు ఏడాదిన్నర క్రితం అమెరికాకు వెళ్లింది.


బోస్టన్‌ యూనివర్సిటీలో చదువుతూ అక్కడే ఎనిమిది మంది తెలుగు విద్యార్థినులతో కలిసి ఉంటోంది. మరో ఆరు నెలల్లో ఆమె విద్యాభ్యాసం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో భారత కాలమానం ప్రకారం ఈ నెల 2న రాత్రి 9.45 గంటల సమయంలో తన స్నేహితులకు వాకింగ్‌కు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. అక్కడి పోలీసులు శ్రీజ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీజ జాడ తెలియకపోవటంతో గురువారం తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఒక్కగానొక్క కుమార్తె ఉన్నత చదువు కోసం వెళ్లి కనపడకుండాపోవటంతో శ్రీజ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చర్చించామని, త్వరగా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని కుటుంబసభ్యులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 07:06 AM