Share News

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన కారు డ్రైవర్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 07:13 AM

కారు డ్రైవర్‌గా పని చేస్తున్న నాంపల్లి మహేశ్‌ అనే వ్యక్తి.. సులువుగా సంపాదించడానికి ఏడు నెలలుగా ఆడుతున్న ఆన్‌లైన్‌/ క్యాసినో గేమ్స్‌కు బానిసయ్యాడు.

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన కారు డ్రైవర్‌
Siddipet Chain Snatching

  • రూ.30 లక్షల నష్టంతో 6 తులాల పుస్తెల తాడు స్నాచింగ్‌

  • సీసీటీవీ కెమెరా ఆధారంగా పట్టుకున్న సిద్దిపేట పోలీసులు

  • నిందితుడి నుంచి కారు పుస్తెల తాడు స్వాధీనం

సిద్దిపేట క్రైం నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కారు డ్రైవర్‌గా పని చేస్తున్న నాంపల్లి మహేశ్‌ అనే వ్యక్తి.. సులువుగా సంపాదించడానికి ఏడు నెలలుగా ఆడుతున్న ఆన్‌లైన్‌/ క్యాసినో గేమ్స్‌కు బానిసయ్యాడు. ఆ గేమ్స్‌లో నష్టపోయిన రూ.30 లక్షలు చెల్లించడానికి కుటుంబ సభ్యుల బంగారం తాకట్టు పెట్టడమే గాక, వేర్వేరు వ్యక్తుల వద్ద పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చాడు. ఆ అప్పులు తీర్చి మళ్లీ ఆన్‌లైన్‌ గేమ్స్‌లో పొగొట్టుకున్న సొమ్ము సంపాదించుకోవడానికి చైన్‌ స్నాచర్‌ అవతారమెత్తాడు. కానీ, సీసీటీవీ కెమెరాల్లో ఫుటేజీ ఆధారంగా ఆయన పోలీసులకు చిక్కిన ఘటన జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో గురువారం చోటు చేసుకుంది. రాజన్న-సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి వాసి మహేశ్‌కు గతంలో కాలకుంట్ల రాజేశం కుటుంబానికి 2 సార్లు కారు డ్రైవర్‌గా పని చేసిన పరిచయం ఉంది.


దీని ఆధారంగా రాజేశం లేని సమయంలో బుధవారం సాయంత్రం 4గంటలకు ఆయన ఇంటికి కిలోమీటర్‌ దూరంలో పెట్టాడు. ముఖానికి మాస్క్‌తో ఆ ఇంటికొచ్చిన మహేశ్‌.. రాజేశం భార్య పెంటమ్మను మంచినీళ్లడిగాడు. ఆమె మంచినీళ్లు ఇచ్చినప్పుడు పెంటమ్మ మెడలోని 6 తులాల బంగారం పుస్తెలతాడును బలవంతంగా లాక్కుని పారిపోయాడు. సీసీ కెమెరాల ఆధారంగా గురువారం ఉదయం రంగీలా దాబా చౌరస్తా వద్ద నిందితుడిని పట్టుకున్నట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్‌ రెడ్డి గురువారం మీడియాకు చెప్పారు. ఈ దొంగతనానికి మహేశ్‌ వినియోగించిన కారును, దొంగలించిన 6 తులాల పుస్తెల తాడును స్వాధీనం చేసుకుని నిందితుడ్ని కోర్టులో హాజరు పరిచారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 07:13 AM