హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 5న తాగునీటి సరఫరా బంద్
ABN , Publish Date - Aug 04 , 2026 | 08:23 AM
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు 5వ తేదీ బుధవారం తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తుతుందని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు 5వ తేదీ బుధవారం తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తుతుందని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న మంజీరా ప్రాజెక్టులో భాగంగా ఉన్న కలబ్‌గూర్ సబ్‌స్టేషన్‌లో 33కేవీ అవుట్‌డోర్ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఏర్పాటు, నిర్వహణ పనులు బుధవారం చేపట్టనున్నారు. ఆరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగే విద్యుత్ పనుల నేపథ్యంలో కలబ్‌గూర్ మంజీరా ప్రాజెక్టు పంపింగ్ ఆగిపోనుంది.
దీంతో కొన్ని ప్రాంతాలకు పాక్షికంగా, మరికొన్ని ప్రాంతాలకు పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోనుంది. నగరంలోని ఆర్‌సీపురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, హఫీజ్‌పేట్, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ, బీహెచ్‌ఈఎల్ ఫ్యాక్టరీ, బీహెచ్‌ఈఎల్ టౌన్‌షి్‌ప, హెచ్‌సీవై, ఇండస్ట్రియల్ ఏరియాలోని బల్క్ తాగునీటి కనెక్షన్లు, ఆఫ్‌టెక్ పాయింట్ల నీటి సరఫరాపై ప్రభావం పడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. నేడు మీ నగరంలో పసిడి ధరలు ఇవీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News