నీటి ఎద్దడి రానీయొద్దు..
ABN , Publish Date - Apr 17 , 2026 | 08:34 AM
వేసవి ఎండలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా సరిపడా నీటిని అందించాలని బీఆర్‌ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ఆదేశించారు.
జలమండలి అధికారులకు ఎమ్మెల్యే వివేకానంద్ ఆదేశం
హైదరాబాద్: వేసవి ఎండలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా సరిపడా నీటిని అందించాలని బీఆర్‌ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ఆదేశించారు. పేట్‌బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన కుత్బుల్లాపూర్ జలమండలి అధికారులతో నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీల్లో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ, తాగునీటి కనెక్షన్ల నిర్మాణం, పైప్‌లైన్ మరమ్మతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సుమారు రూ.2.04 కోట్లతో కొత్తగా చేపట్టనున్న మురుగు నీటి, తాగునీటి సరఫరా పైప్‌లైన్ల పనులను త్వరగా ప్రారంభించి, పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. అన్ని సర్కిళ్లలో ఇప్పటికే చేపట్టిన డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని, కుత్బుల్లాపూర్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి పైప్‌లైన్, మురుగునీటి పైప్‌లైన్ వ్యవస్థను విస్తరించాలన్నారు.
అవసరమైన చోట రిజర్వాయువులను నిర్మించి, భవిష్యత్తు అవసరాలకు సరి పోయేలా నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎండలు మండుతుండడంతో తాగు నీటి ఎద్దడి లేకుండా అధికారులు పని చేసినప్పుడే ప్రజలు గుర్తిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ జోన్ జలమండలి జీఎంలు మాధవి, పరిమిళ, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ రేట్స్.. కొనసాగుతున్న ధరలు పెరుగుదల
ఆర్ అండ్ బీలో ఎక్స్‌టెన్షన్లు ఇవ్వొద్దు
Read Latest Telangana News and National News