Share News

ఆర్‌ అండ్‌ బీలో ఎక్స్‌టెన్షన్లు ఇవ్వొద్దు

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:32 AM

రోడ్లు భవనాల శాఖలో రిటైరైన అధికారులు, ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిలో మళ్లీ నియమించడం, ఎక్స్‌టెన్షన్లు ఇవ్వడం చేయొద్దని ఆర్‌ అండ్‌ బీ ..

ఆర్‌ అండ్‌ బీలో ఎక్స్‌టెన్షన్లు ఇవ్వొద్దు

  • ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి

రోడ్లు భవనాల శాఖలో రిటైరైన అధికారులు, ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిలో మళ్లీ నియమించడం, ఎక్స్‌టెన్షన్లు ఇవ్వడం చేయొద్దని ఆర్‌ అండ్‌ బీ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరింది. శాఖలో కొంతమంది అధికారులు రిటైరైనా ఆయా పోస్టుల్లో వారినే కాంట్రాక్టు విధానంలో మళ్లీ తీసుకుంటున్నారని, ఇది తీవ్ర అభ్యంతరకరమని తెలిపింది. ఒకవేళ రిటైరైన వారిని తీసుకోవాలనుకుంటే కన్సల్టెంట్‌ పేరుతో తీసుకోవాలని సూచించింది. కాంట్రాక్టు విధానం, ఎక్స్‌టెన్షన్లను నిరసిస్తూ గురువారం ఆర్‌ అండ్‌ బీ కేంద్ర కార్యాలయం ఎదుట అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. భవనాల విభాగంలో జీ రాజేశ్వర్‌రెడ్డిని, హ్యామ్‌ విభాగంలో బీ వెంకటేశ్వరరావును చీఫ్‌ ఇంజనీర్లుగా మళ్లీ నియమించడం సరికాదని శ్రీనివాసరావు పేర్కొన్నారు. నేషనల్‌ హైవేస్‌ విభాగంలో ఎస్‌ఈగా రిటైరైన పీ ధర్మారెడ్డికి రెండోసారి కూడా కాంట్రాక్టు విధానంలో తీసుకుని, చీఫ్‌ ఇంజనీర్‌గా పదోన్నతి ఇచ్చారని చెప్పారు. ఈ విధానం వల్ల పదోన్నతులు రావాల్సిన అధికారులు, ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు.

Updated Date - Apr 17 , 2026 | 04:32 AM