Share News

సీట్లు మార్చి.. రంగులు వేసి..

ABN , Publish Date - Apr 17 , 2026 | 07:48 AM

ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీ బస్సులకే రంగులు వేసి.. సీట్లు మార్చి డీలక్స్‌లుగా ఆర్టీసీ తయారు చేస్తోంది. కొత్త బస్సులను మాత్రం తీసుకురావడం లేదు.

సీట్లు మార్చి.. రంగులు వేసి..
TGSRTC, City Buses

  • ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీ బస్సులనే డీలక్స్‌లుగా..

  • రద్దీకి అనుగుణంగా పెరగని బస్సుల సంఖ్య

హైదరాబాద్‌ సిటీ: ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీ బస్సులకే రంగులు వేసి.. సీట్లు మార్చి డీలక్స్‌లుగా ఆర్టీసీ తయారు చేస్తోంది. కొత్త బస్సులను మాత్రం తీసుకురావడం లేదు. గ్రేటర్‌ శివారు ప్రాంతాల్లో వందల సంఖ్యలో గేటెడ్‌ కమ్యూనిటీలు, కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. ప్రయాణ అవసరాలకు సరిపడా ఆర్టీసీ బస్సులు లేవు. ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే సుమారు 7 వేల బస్సులు ఆర్టీసీ నడపాలని రవాణా రంగ నిఫుణులు చెబుతున్నారు.


city3.2.jpgప్రస్తుతం అందులో సగం బస్సులు కూడా నడవడం లేదు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో ప్రయాణికుల రద్దీ రెట్టింపయ్యింది. రద్దీకి అనుగుణంగా సంఖ్య పెంచకపోవడంతో గ్రేటర్‌ జోన్‌లో 80 శాతం బస్సులు ఓవర్‌లోడ్‌ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. మహిళా ప్రయాణికులు సైతం ఫుట్‌బోర్డు ప్రయాణాలు సాగిస్తున్నారు.


కొత్త బస్సులేవీ..

బస్సుల సంఖ్య పెంచలేని ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌, ఆర్డీనరి బస్సుల్లో సీట్లు మార్చి, రంగులేసి డీలక్స్‌ బస్సులుగా మార్చుతోంది. పాత బస్సులను మోడిఫికేషన్‌ చేసి రోడ్లపైకి తీసుకువస్తోంది. సీట్లు మార్చి, రంగులేయడం సరే.. కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్ రేట్స్.. కొనసాగుతున్న ధరలు పెరుగుదల

ఆర్‌ అండ్‌ బీలో ఎక్స్‌టెన్షన్లు ఇవ్వొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 17 , 2026 | 07:48 AM