Share News

గోల్డ్ రేట్స్.. కొనసాగుతున్న ధరల పెరుగుదల

ABN , Publish Date - Apr 17 , 2026 | 06:42 AM

గత మూడు రోజులుగా దేశంలో బంగారం ధరలు వరుసపెట్టి పెరుగుతున్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

గోల్డ్ రేట్స్.. కొనసాగుతున్న ధరల పెరుగుదల
Gold, Silver Rates on April 17

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం ధరలు గత మూడు రోజులుగా ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు తగ్గుతాయన్న సంకేతాలతో పాటు అక్షయ తృతీయ సమీపిస్తున్న తరుణంలో పసిడికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. గత మూడు రోజుల్లో పసిడి ధరలు సుమారు రూ.3 వేల మేర పెరిగాయి.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ కథనం ప్రకారం, నేడు (ఏప్రిల్ 17) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,580గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,610గా ఉంది. వెండి ధర దాదాపుగా స్థిరంగానే ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,74,900ల వద్ద కొనసాగుతోంది.


చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,670గా ఉంది. ముంబైలో రూ.1,55,580 వద్ద, న్యూఢిల్లీలో రూ.1,55,730 వద్ద కదలాడుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర చెన్నైలో రూ.1,43,610గా, ముంబైలో రూ.1,42,610గా, న్యూఢిల్లీలో రూ.1,42,760గా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వెండి ధరలు రూ.2.69 లక్షల నుంచి రూ.2.74 లక్షల వరకూ ఉన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ల పసిడి ధర 4,787 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర 78 డాలర్ల వద్ద కొనసాగుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

విప్రో రూ.15,000 కోట్ల బైబ్యాక్‌

పర్యాటకానికీ యుద్ధ గ్రహణం

Updated Date - Apr 17 , 2026 | 08:23 AM