Share News

తండ్రి మృతి తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య

ABN , Publish Date - Apr 17 , 2026 | 07:19 AM

తండ్రి మృతిని తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

తండ్రి మృతి తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య
student suicide, crime news

హైదరాబాద్: తండ్రి మృతిని తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కాకినాడకు చెందిన చెన్నకేశవులు కుమార్తె పి. జ్ఞానశ్రీ(21) మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. మైసమ్మగూడలోని ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటోంది. కాగా మార్చి 31న తండ్రి చెన్నకేశవులు మృతి చెందడంతో సొంతూరుకు వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొంది.


city2.2.jpg

రెండు రోజుల క్రితం కాలేజీకి వచ్చి హాస్టల్‌లో ఉంటోంది. బుధవారం కాలేజీలో పరీక్ష రాసిన జ్ఞాన శ్రీ.. గురువారం పరీక్షకు హాజరు కాకుండా హాస్టల్‌లోనే ఉండిపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన ఆమె స్నేహితరాళ్లు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జ్ఞానశ్రీ చేతిలో సుసైడ్ నోట్‌ లభించింది. ‘డాడీ లేని జీవితం ఊహించలేను’ అంటూ లేఖలో పేర్కొంది. తన తమ్ముడిని తాత వద్ద ఉండమని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్ రేట్స్.. కొనసాగుతున్న ధరలు పెరుగుదల

ఆర్‌ అండ్‌ బీలో ఎక్స్‌టెన్షన్లు ఇవ్వొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 17 , 2026 | 08:23 AM