20 మంది మృతి.. వేదాంత గ్రూప్ ఛైర్మన్‌పై కేసు నమోదు..
ABN , Publish Date - Apr 17 , 2026 | 06:59 AM
ఛత్తీస్‌గఢ్ శక్తి జిల్లాలోని వేదాంత గ్రూప్ పవర్ ప్లాంట్‌లో పేలుడు ఘటనపై కేసు నమోదు అయ్యింది. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సహా పలువురిపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు గురువారం నాడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఛత్తీస్‌గఢ్: శక్తి జిల్లాలోని వేదాంత గ్రూప్ పవర్ ప్లాంట్‌లో పేలుడు ఘటన (Vedanta Power Plant Tragedy)పై కేసు నమోదు అయ్యింది. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్(Anil Agarwal) సహా పలువురిపై ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) పోలీసులు గురువారం నాడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈనెల 14న సింగితరాయ్‌లోని వేదాంత ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై దాబ్రా పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 106, 289, 3(5) కింద కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు శక్తి జిల్లా ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ తెలిపారు. వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్‌తో సహా మరో ఎనిమిది నుంచి పది మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు ఆయన వెల్లడించారు.
దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులుగా తేలితే మరికొంతమందిపైనా కేసులు పెట్టే అవకాశం ఉందని ఠాకూర్ పేర్కొన్నారు. మరోవైపు ప్రమాదానికి సంబంధించిన పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు ఇంకా రావాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. అలాగే పేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు నిపుణులతో కూడిన సాంకేతిక బృందాన్నీ ఏర్పాటు చేశామన్నారు. అన్ని నివేదికలు అందిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోల్డ్ రేట్స్.. కొనసాగుతున్న ధరల పెరుగుదల
పెట్టుబడుల పేరుతో రూ.5.6 కోట్ల మోసం