Share News

జోస్‌అలుక్కాస్‌ లో అక్షయ తృతీయ ఆఫర్లు

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:23 AM

జోస్‌ అలుక్కాస్‌.. అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 19, 20 తేదీల్లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అక్షయ తృతీయ ఆఫర్లలో భాగంగా వినియోగదారులు...

జోస్‌అలుక్కాస్‌ లో అక్షయ తృతీయ ఆఫర్లు

హైదరాబాద్‌: జోస్‌ అలుక్కాస్‌.. అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 19, 20 తేదీల్లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అక్షయ తృతీయ ఆఫర్లలో భాగంగా వినియోగదారులు ఎంపిక చేసిన బంగారు ఆభరణాల తయారీ చార్జీలపై ఫ్లాట్‌ 50 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపింది. అలాగే వజ్రాల విలువకు సంబంధించి అన్ని కలెక్షన్స్‌పై ఫ్లాట్‌ 30 శాతం రాయితీని ఆఫర్‌ చేస్తున్నట్లు పేర్కొంది. ప్లాటినం ఆభరణాల మేకింగ్‌ చార్జీలపై 30 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా వినియోగదారులు 10 గ్రాముల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఉచితంగా గోల్డ్‌ కాయిన్‌తో పాటు వజ్రాల కొనుగోలుపై ఉచితంగా బంగారు నాణేన్ని పొందవచ్చని పేర్కొంది. అదనంగా పాత 22 క్యారట్ల బంగారం మార్పిడిపై ఎలాంటి తరుగు ఉండదని తెలిపింది. వీటితో పాటు కస్టమర్లు ఆభరణాల బుకింగ్స్‌పై 10 శాతం చెల్లించి గోల్డ్‌ రేట్‌ ప్రొటెక్షన్‌ ప్రయోజనాలను పొందవచ్చని జోస్‌ అలుక్కాస్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

వేగంగా తినే అలవాటు బరువు పెరగడానికి కారణమవుతుందా?

'దోశ, ఇడ్లీ' పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..

Updated Date - Apr 17 , 2026 | 03:23 AM