Share News

ఇదేం రాక్షస మనస్తత్వం?

ABN , Publish Date - Apr 17 , 2026 | 06:49 AM

‘తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. దైవం అంటే భక్తి లేదు.. దేశమంటే ద్వేషం.. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారు. ఉద్యోగాలొస్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారు.

ఇదేం రాక్షస మనస్తత్వం?

  • తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. దేవుడంటే భక్తి లేదు.. దేశమంటే ద్వేషం

  • రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు జగన్‌పై మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

అమరావతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ‘తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. దైవం అంటే భక్తి లేదు.. దేశమంటే ద్వేషం.. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారు. ఉద్యోగాలొస్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారు. నిలువెల్లా స్వార్థం.. మనసంతా విధ్వంసంతో రప్పారప్పా నరుకుతాం.. అమరావతిని మార్చేస్తాం.. కట్టినవన్నీ కూల్చేస్తాం. కంపెనీలన్నీ వెళ్లగొడతాం.. ఏమిటీ దుర్మార్గ పనులు జగన్మోహన్‌రెడ్డి గారూ..!’ అని మంత్రి లోకేశ్‌ నిలదీశారు. దేశ రక్షణకు అధునాతన బోట్లు తయారుచేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి.. తరిమేస్తానంటారా.. ఇదేం రాక్షస మనస్తత్వమని ‘ఎక్స్‌’లో మండిపడ్డారు. మత్స్యకారుల పిల్లలకు వెయ్యికిపైగా ఉద్యోగాలు వస్తాయంటే ఆనందించాల్సింది పోయి, అడ్డుకుంటాననడం ముమ్మాటికీ సైకోయిజమేనన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 06:50 AM