పంచాయతీ ఓటర్లు 2,89,07,817
ABN , Publish Date - Apr 17 , 2026 | 06:36 AM
రాష్ట్రవ్యాప్తంగా 13,259 పంచాయతీల ఓటర్ల జాబితాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాల మేరకు...
వీరిలో మహిళలు 1.46 కోట్ల మంది.. పురుషులు 1.42 కోట్లు
13,259 పంచాయతీల ఓటర్ల జాబితా ప్రకటన
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 13,259 పంచాయతీల ఓటర్ల జాబితాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాల మేరకు ఈ నెల 15న ఓటర్ల తుది జాబితాను ప్రకటించాల్సి ఉండడంతో పంచాయతీరాజ్ శాఖ ఆ మేరకు చర్యలు చేపట్టింది. మొత్తం పంచాయతీ ఎన్నికలకు 2,89,07,817 మంది ఓటర్లుగా నమోదయ్యారని వెల్లడించింది. వీరిలో మహిళల సంఖ్యే (1,46,76,609) అధికమని.. పురుష ఓటర్లు 1,42,29,738 మంది. ట్రాన్స్‌జెండర్లు/ ఇతరులు 1,432 మందిగా పేర్కొంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ఈ ఓటర్ల జాబితాను ప్రకటించింది. ప్రతి మూడు నెలలకోసారి ఓట్ల నమోదుకు అవకాశం ఉండడంతో ఇప్పుడు ప్రకటించిందే తుది జాబితా కాదు. మొత్తం 13,348 పంచాయతీలకుగాను 13,259 పంచాయతీల ఓటర్ల జాబితాను ప్రకటించినట్లు తెలుస్తోంది. 17 జిల్లాల్లో ఓటర్ల జాబితాలు పూర్తి కాగా.. కోర్టు కేసులు తదితర కారణాలతో 11 జిల్లాల్లోని 89 పంచాయతీ జాబితాలు పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నారు.