Share News

చైత్ర అమావాస్య.. ఈ రాశుల వారు ఇలా చేస్తే..

ABN , Publish Date - Apr 17 , 2026 | 07:30 AM

అమావాస్య తిథి వేళ స్నాన, జప, తర్పణాల వల్ల పితృదేవతలు శాంతిస్తారని పెద్దలు చెబుతారు. అలా చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందంటారు.

చైత్ర అమావాస్య.. ఈ రాశుల వారు ఇలా చేస్తే..
Chaitra Amavasya

అమావాస్య తిథి వేళ స్నాన, జప, తర్పణాల వల్ల పితృదేవతలు శాంతిస్తారని పెద్దలు చెబుతారు. అలా చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందంటారు. ఈ రోజు చైత్ర అమావాస్య. ఈ రోజు ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేస్తే విశేష ఫలితాలు పొందుతారనే విషయాన్ని జోతిష్య పండితులు వివరిస్తున్నారు.


మేషం..

ఎర్రటి వస్త్రాలు దానం చేయాలి. దీని వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థికపరంగా ప్రయోజనాలు అందుకుంటారు.

వృషభం..

బియ్యం, పాలు దానం చేయాలి. తద్వారా సంపద పెరుగుతుంది.

మిథునం..

పెసలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. తద్వారా ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోష వాతావరణం ఏర్పడుతుంది.


కర్కాటకం..

తెల్లటి వస్త్రాలు దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది.

సింహం..

బెల్లాన్ని దానం చేయడం వల్ల విశేష ఫలితం పొందుతారు.

కన్య..

మినపప్పు దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.


తుల..

పెరుగు దానం చేస్తే విశేష ఫలితాలు పొందవచ్చు. జీవితంలో సంతోషం పెరుగుతుంది.

వృశ్చికం..

బెల్లం దానం చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ఒత్తిడి తగ్గుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

ధనస్సు..

పంచదార దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. తద్వారా సానుకూల శక్తి పెరుగుతుంది.


మకరం..

ఆవనూనె దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శని దోషం నుంచి బయటపడతారు.

కుంభం..

నల్ల నువ్వులు దానం చేస్తే మంచి జరుగుతుంది.

మీనం..

పసుపు రంగు వస్తువులు దానం చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. భగవంతుని అనుగ్రహం కలుగుతుంది.


ఈ రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు..

అమావాస్య రోజు జీవహింస చేయకూడదు. మాంసాహారాన్ని తీసుకోవద్దు. మూగ జీవులకు ఆహారం అందించడం వల్ల దోషాలు తొలగిపోతాయని చెబుతారు. చీమలకు ఆహారంగా పంచదార వేయడం వల్ల పలు దోషాలు పోతాయని అంటారు. వేసవి కాలం కావడంతో.. పేదలకు చల్లని తాగు నీరు అందించాలి. గొడుగులతోపాటు పుచ్చకాయలు దానంగా ఇవ్వాలి. ఈ రోజు రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి.. ప్రదక్షిణలు చేయడం వల్ల పితృ దోష తీవ్రత తగ్గుతుందంటారు. ఈ రోజు దాన ధర్మాలు చేయడం వల్ల మేలు జరుగుతుందని చెబుతారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేటి రాశి ఫలాలు.. ఎలా ఉన్నాయంటే..

సీట్లు మార్చి.. రంగులు వేసి..

For More Devotional News And Telugu News

Updated Date - Apr 17 , 2026 | 08:23 AM